హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలంటే అమెరికా తన వైఖరిని మార్చుకోవాలి : ఆరు షరతులను విధించిన ఇరాన్

الثلاثاء، 11 أغسطس 2026

international Iran Sets Six Conditions Mohammad Bagher Zolghadr US Must Change Its Stance to Reopen Strait of Hormuz

t f B! P L

హార్ముజ్ జలసంధి ద్వారా వాణిజ్య నౌకల రాకపోకలను పునరుద్ధరించడానికి ఇరాన్ ఆరు షరతులను విధించింది. ఈ జలసంధిని తిరిగి తెరవాలంటే అమెరికా తన వైఖరిని మార్చుకోవాలని స్పష్టం చేస్తూ వాషింగ్టన్ ముందు ఆరు ప్రధాన డిమాండ్లను ఉంచినట్లు ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ మాజీ కార్యదర్శి, సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ సలహాదారు అయిన మొహమ్మద్ బఘేర్ జోల్ఘదర్ వెల్లడించారు. మరోవైపు ఈ మార్గంలో వాణిజ్య నౌకల నిర్వహణ కోసం ఒమన్‌తో ఉమ్మడి సాంకేతిక ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ఇరాన్ చేరువైంది. ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం రవాణా నిర్వహణలో టెహ్రాన్, మస్కట్‌లకు ఉమ్మడి బాధ్యతలు ఉంటాయి. అయితే ఒమన్‌తో ఒప్పందం కుదిరినంత మాత్రాన జలసంధి తెరుచుకోదని.. తమ ఆరు పొలిటికల్ డిమాండ్లను పరిష్కరిస్తేనే సాధారణ నౌకాయానం సాధ్యమవుతుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖ్చి స్పష్టం చేశారు. ఇరాన్‌పై అమెరికా తన బెదిరింపు ధోరణిని, అవమానకరమైన భాషను శాశ్వతంగా మానుకోవాలి. ప్రాంతీయ వివాదాల ముగింపు, లెబనాన్, పాలస్తీనా, యెమెన్ మరియు ఇరాక్‌లలో ఇరాన్ మరియు దాని మిత్రదేశాలపై అమెరికా సాగిస్తున్న సైనిక దురాక్రమణను తక్షణమే ముగించాలి. నావికా దిగ్బంధనం ఎత్తివేత: ఇరాన్ చుట్టూ ఉన్న ప్రాంతాల నుండి అమెరికా నావికా, వైమానిక దళాలను ఉపసంహరించుకోవడంతో పాటు విధించిన నావికా దిగ్బంధనాన్ని ఎత్తివేయాలి. యుద్ధ పరిహారం: ఇటీవల జరిగిన రెండు యుద్ధాలలో (2025లో జరిగిన 12 రోజుల యుద్ధంతో సహా) ఇరాన్‌కు జరిగిన ఆస్తి, ప్రాణ నష్టానికి అమెరికా భారీ పరిహారం చెల్లించాలి. ఇరాన్‌పై విధించిన క్రూరమైన, చట్టవిరుద్ధమైన ఆర్థిక ఆంక్షలను తక్షణమే తొలగించాలి. స్తంభింపజేసిన ఆస్తుల విడుదల: విదేశాలలో జప్తు చేసిన లేదా స్తంభింపజేసిన ఇరాన్ నిధులను, ఆస్తులను బేషరతుగా విడుదల చేయాలి. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ