బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ గాయపడటంతో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈస్ట్ జోన్ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. ఈస్ట్ జోన్ జట్టు కెప్టెన్ ఇషాన్ కిషన్ వికెట్ కీపింగ్ చేస్తుండగా గాయం కారణంగా మైదానం వీడవలసి వచ్చింది. ఆ సంఘటనతో 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ తొలిసారిగా ఓ సీనియర్ దేశీయ క్రికెట్ మ్యాచ్‌కు కెప్టెన్ అయ్యాడు. ఇషాన్ గాయం కారణంగా స్టేడియం విడిచివెళ్లడంతో తాత్కాలికంగా వైభవ్ సూర్యవంశీ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. ఈస్ట్ జోన్ ఫీల్డింగ్ చేస్తుండగా ఇన్నింగ్స్ 19వ ఓవర్‌లో అభిజిత్ సర్కార్ బౌలింగ్ చేస్తున్నాడు. అతను వేసిన బంతుల్లో ఒకటి ఇషాన్ కిషన్ బొటనవేలికి తగిలింది. ఒక ఫిజియో మైదానంలోకి వచ్చాడు, కానీ అక్కడి పరిస్థితుల కారణంగా ఇషాన్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇషాన్ తన బొటనవేలికి ఐస్ పెట్టుకోవడానికి మైదానం విడిచి వెళ్ళినప్పుడు జార్ఖండ్‌కు చెందిన కుమార్ కుశాగ్ర వికెట్ కీపింగ్ బాధ్యతలు స్వీకరించాడు. ఇషాన్ జట్టుకు దూరమవ్వడంతో వైభవ్ సూర్యవంశి తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించాడు, ఎందుకంటే వైభవ్ సూర్యవంశి అప్పటికే ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇప్పుడు కేవలం తొమ్మిది ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల తర్వాత వైభవ్ సూర్యవంశి తన దేశీయ క్రికెట్ కెరీర్‌లో తొలిసారిగా ఒక సీనియర్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
ఈస్ట్ జోన్ జట్టు కెప్టెన్ ఇషాన్ కిషన్ కు గాయం : కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ
الأحد، 30 أغسطس 2026
against Central Zone at the Centre of Excellence in Bengaluru cricket East Zone Captain Ishan Kishan Injured national sports Vaibhav Suryavanshi Takes Over as Captain
ليست هناك تعليقات:
إرسال تعليق