తెలంగాణలోని కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలో జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి కారు, ఆటో ఢీకొన్న సంఘటనలో వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ సమీపంలో ఎల్లారెడ్డి నుంచి మెదక్ వైపు వెళ్తున్న కారు, మెదక్ నుంచి గోపాల్ పేట్ వస్తున్న ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గోపాల్ పేట్‌కు చేసిన ఆటో డ్రైవర్ అఫ్రీది తీవ్ర గాయాలయ్యాయని, పరిస్థితి విషమంగా ఉందని దీంతో ఆటో డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం మెదక్‌లోని ఓ ప్రైవేట్ తరలించినట్లు తెలిపారు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు కారు వదిలేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రోడ్డుపై ఉన్న ఆటో కారును ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా జేసీబీ సహాయంతో.. రోడ్డు మధ్యలో నుంచి తొలగించారు.
కారు, ఆటో ఎదురెదురుగా ఢీ : ఆటో డ్రైవర్ పరిస్థితి విషమం
Monday, August 10, 2026
Auto Driver in Critical Condition Car and Auto-rickshaw Collide Head-on Kamareddy district Nagireddypet mandal headquarters telangana
No comments:
Post a Comment