పిన్న వయసులో గిన్నిస్ రికార్డు సృష్టించిన లక్ష్మణన్ మేయప్పన్

الاثنين، 17 أغسطس 2026

completed an internationally recognized chartered accountancy qualification international Lakshmanan Meyappan Sets Guinness Record at a Young Age national

t f B! P L

దుబాయ్‌లో స్థిరపడిన లక్ష్మణన్ మేయప్పన్ అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించాడు. 16 ఏళ్ల 141 రోజుల వయసులోనే అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన చార్టర్డ్ అకౌంటింగ్ అర్హతను పూర్తి చేశాడు. దీని ద్వారా ‘ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన పురుష చార్టర్డ్ అకౌంటెంట్’గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో తన పేరును లిఖించుకుని భారత్ కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాడు. లక్ష్మణన్ ఫైనాన్స్ ప్రయాణం కోవిడ్-19 మహమ్మారి సమయంలో చాలా ఆసక్తికరంగా ప్రారంభమైంది. తల్లి స్ఫూర్తితో 10వ తరగతి బోర్డు పరీక్షలు పూర్తయిన తర్వాత లాక్‌డౌన్ సమయంలో లక్ష్మణన్ తల్లి అతనికి అకౌంటింగ్ ప్రాథమిక అంశాలను నేర్పించారు. తల్లి నుంచి లభించిన ప్రోత్సాహంతో 15 ఏళ్ల వయసులో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన చార్టర్డ్ అకౌంటింగ్ కోర్సులో చేరిన లక్ష్మణన్, కేవలం ఒకే సంవత్సరంలో దాన్ని విజయవంతంగా పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. గిన్నిస్ రికార్డు సాధించడమే కాకుండా, తన చదువు మరియు వృత్తిపరమైన ప్రస్థానాన్ని లక్ష్మణన్ మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాడు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన చార్టర్డ్ అకౌంటింగ్ అర్హత సాధించిన తర్వాత ఫైనాన్స్ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చార్టర్డ్ ఫైనాన్సియల్ అనలిస్ట్ చార్టర్‌ను కూడా పట్టుదలతో పూర్తి చేశాడు. ప్రస్తుతం ఫైనాన్స్‌లో ఎమ్మెస్సీ చదువుతూనే, దుబాయ్‌లోని ‘సెంచరీ ఫైనాన్షియల్’ సంస్థలో సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ఇన్వెస్ట్‌మెంట్లు, మార్కెట్ రీసెర్చ్, ఆర్థిక విశ్లేషణ వంటి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ చిన్న వయసులోనే అగ్రస్థానంలో నిలిచాడు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ