పశ్చిమ బెంగాల్‌లోని బీర్బూమ్ జిల్లా తారాపీఠ్‌లో సోమవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రసిద్ధ తారాపీఠ్ ఆలయానికి, స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమీపంలో ఉన్న 'బిదిష్ని' అనే హోటల్లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో హాటల్లో బసచేసిన ఆరుగురు భక్తులు సజీవ దహనమయ్యారు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో హోటల్లోని అతిథులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. వర్షం పడుతుండటంతో హోటల్ సిబ్బంది కూడా నిద్రలోనే ఉన్నారని, ప్రాంగణమంతా దట్టమైన పొగ అలుముకోవడంతో లోపల ఉన్నవారికి ఊపిరాడక తీవ్ర ఇబ్బందికి గురయ్యారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అకస్మాత్తుగా హోటల్ కింది అంతస్తులో ప్రారంభమైన మంటలు నిమిషాల వ్యవధిలోనే పై అంతస్తులకు వేగంగా వ్యాపించాయి. అగ్నిప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హోటల్లో చిక్కుకున్న పలువురిని రక్షించి, చికిత్స కోసం రాంపూర్‌హాట్ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రికి తరలించారు. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. శ్రావణ సోమవారం కావడంతో తారాపీఠ్ ఆలయంలో దేవుడి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడకు చేరుకున్నారు. ప్రమాదంలో మరణించిన వారు కూడా ఆలయ దర్శనం కోసం ఆదివారం రాత్రే ఈ హోటల్లో బస చేసినట్లు తెలిసింది. షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ.. అధికారులు ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను నిర్ధారించేందుకు దర్యాప్తు వేగవంతం చేశారు. జరిగిన ఆస్తి నష్టాన్ని, ప్రభావితులైన వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
ホーム
/
west bengal
/
హోటల్లో ఘోర అగ్నిప్రమాదం : ఆరుగురు సజీవదహనం!
الاثنين، 17 أغسطس 2026
Bidishni in Tarapith Horrific Hotel Fire located in the Birbhum district national Six Burnt Alive victims had checked into the hotel on Sunday night specifically to visit the temple west bengal
ليست هناك تعليقات:
إرسال تعليق