హైదరాబాద్ లోని కోకాపేటకు చెందిన అబ్దుల్ సమీద్ (31), తన స్నేహితుడితో కలిసి నార్సింగిలోని ఓ బ్లింకిట్ సంస్థలో డెలివరీ బాయ్‌లుగా పనిచేస్తున్నారు. డెలివరీ విషయంలో ఇద్దరి మధ్య కొంతకాలంగా విబేధాలు ఉండగా, గురువారం రాత్రి పనిచేసే ప్రదేశంలోనే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. వివాదం తీవ్రరూపం దాల్చడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో సమీద్ తలకు తీవ్ర గాయం కావడంతో పెద్ద ఎత్తున రక్తస్రావమై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.గాయపడిన సమీద్ ను వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఘర్షణకు దారితీసిన కారణాలు, దాడికి పాల్పడిన వ్యక్తి వివరాలపై ఆరా తీస్తున్నారు. సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
బ్లింకిట్ డెలివరీ బాయ్ ల మధ్య ఘర్షణ : తలకు తీవ్ర గాయమై ఒకరు మృతి
الجمعة، 14 أغسطس 2026
Clash between blanket delivery boys crime hyderabad Kokapet One died due to severe head injuries telangana
ليست هناك تعليقات:
إرسال تعليق