తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) నూతన ఛైర్మన్‌గా శ్రీధరవర్మ అలిపిరి సమీపంలోని ఎస్వీబీసీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కూటమి నేతలు శ్రీధరవర్మను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎస్వీబీసీ ఛైర్మన్‌గా అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందని శ్రీధరవర్మ పేర్కొన్నారు. శ్రీవేంకటేశ్వర స్వామి ఖ్యాతిని, హిందూ ధర్మాన్ని ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చేయడంలో ఎస్వీబీసీ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఉద్యోగులందరితో సమన్వయంతో కలిసి పని చేస్తానని తెలిపారు. ఎస్వీబీసీ ఛైర్మన్‌గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకి, మంత్రి నారా లోకేష్ కి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానని శ్రీధర్ వర్మ తెలిపారు. శ్రీ రంగనాయకుల మండపంలో ఆశీర్వాదాలు అందుకున్న ఎస్వీబీసీ చైర్మన్ శ్రీధర్ వర్మ గారు అనంతరం తిరుమల నుండి తిరుపతికి చేరి ఎస్విబిసి చైర్మన్ గా తన బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి నందమూరి కుటుంబ సభ్యులు నందమూరి మోహన్ కృష్ణ, నందమూరి రామకృష్ణ, నందమూరి మోహన రూపా, కామినేని సీమంతిని, దగ్గుబాటి నివేదిత, ఏపీ ఎఫ్ డి సి చైర్మన్ భారత భూషణ్, తెలుగు చిత్ర నిర్మాతల మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్నకుమార్ హాజరై శ్రీధర్ వర్మ గారికి అభినందనలు తెలిపారు.
ఎస్వీబీసీ ఛైర్మన్‌గా భాద్యతలు చేపట్టిన శ్రీధర్ వర్మ
الأحد، 23 أغسطس 2026
Andhra Pradesh Sridhar Varma Assumes Charge as SVBC Chairman Sridhar Varma expressed his happiness at the opportunity to serve as the SVBC Chairman
ليست هناك تعليقات:
إرسال تعليق