ఉపాధ్యాయురాలిని గన్‌తో కాల్చి చంపిన దుండగుడు : అదే గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యక్తి

الاثنين، 21 سبتمبر 2026

a 26-year-old resident of Hidayat Nagar Lakhimpur Kheri Man Shoots Teacher Dead national Nishat Fatima Then Kills Himself with the Same Gun Uttar Pradesh

t f B! P L

త్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో ఒక వ్యక్తి ఉపాధ్యాయురాలిపై కాల్పులు జరిపి, అదే గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది చూసిన  స్కూల్‌ విద్యార్థులు, టీచర్లు షాక్‌ కు గురైయ్యారు. హిదాయత్ నగర్ నివాసి అయిన 26 ఏళ్ల నిషాత్ ఫాతిమా ఏడాదిగా లఖింపూర్ ఖేరీలోని చిల్డ్రన్స్ అకాడమీ స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తున్నది. సోమవారం ఉదయం 11:30 గంటలకు ఆమెకు తెలిసిన 28 ఏళ్ల మహమ్మద్ సౌద్ ఆ స్కూల్‌కు చేరుకున్నాడు. కారిడార్‌లో ఫాతిమాను కలుసుకుని మాట్లాడాడు. ఉన్నట్టుండి బ్యాగ్‌ నుంచి తుపాకీ తీసి ఆ టీచర్‌పై కాల్పులు జరిపి హత్య చేశాడు. ఆ తర్వాత అక్కడే తనను తాను గన్‌తో కాల్చుకుని అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ స్కూల్‌కు చేరుకొని పిల్లలను స్కూల్‌ నుంచి వారి ఇళ్లకు పంపివేశారు. ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించి ఆధారాలు సేకరించారు. ఆ తర్వాత టీచర్‌ ఫాతిమా, సౌద్‌ మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఫాతిమా, సౌద్ చాలా కాలంగా ఒకరికొకరు తెలుసని, నిత్యం మాట్లాడుకునేవారని పోలీస్‌ అధికారిణి ఖ్యాతి గార్గ్ తెలిపారు. అయితే సౌద్‌ ఎందుకు ఆమెను కాల్చి చంపి ఆత్మహత్యకు పాల్పడ్డాడో అన్నది తెలియలేదని చెప్పారు. ఇరు కుటుంబాలతో పాటు, స్కూల్‌ యాజమాన్యం, ఉపాధ్యాయులు, ప్రత్యక్ష సాక్షులు, ఇతరులను విచారిస్తున్నట్లు పోలీస్‌ అధికారిణి వివరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ