జపాన్ లో వేసవి కాలం తీవ్రమైన ఎండలను, ఉక్కపోతను తట్టుకోవడానికి ఏసీ షర్టును కనిపెట్టారు. శరీరానికే నేరుగా గాలి వీచి చల్లదనాన్ని ఇచ్చే ఏసీ షర్టును అందుబాటులోకి తెచ్చింది.. ఈ చల్లటి షర్టుకే ఇప్పుడు జపాన్ ప్రజల్లో భారీ ఆదరణ లభిస్తోంది. జపాన్‌కు చెందిన ప్రముఖ దుస్తుల సంస్థ యోఫుకు నో అయోమా, ఫ్యాన్ దుస్తులను తయారు చేసే FZN సంస్థతో కలిసి ఈ ఆధునిక దుస్తులను రూపొందించింది. ఈ చల్లటి షర్టుకు "కూచో వేర్ షార్ట్-స్లీవ్డ్ షర్ట్" అని పేరు కూడా పెట్టారు.. ఈ షర్టు చూడటానికి మామూలు ఫార్మల్ షర్టు లాగే ఉంటుంది. ఈ ఏసీ షర్టు వెనుక భాగంలో నడుము ప్రాంతంలో మాత్రమే చిన్నగా, తక్కువ బరువు ఉండే 2 ఫ్యాన్లు అమర్చారు. షర్టు లోపల ఉండే ఈ విసనకర్రలు బయటి గాలిని పీల్చుకుని షర్టు లోపలికి పంపుతాయి. దీని వల్ల వచ్చే గాలి, శరీరంలో పట్టే చెమటను వెంటనే ఆవిరి చేసి, శరీరాన్ని ఎప్పుడూ జిల్లుగా ఉంచడానికి సహాయపడుతుంది. ముందు నుండి లేదా పక్కల నుండి చూస్తే షర్టు లోపల ఇలాంటి ఫ్యాన్ ఒకటి ఉందనేదే తెలియదు.. అంత నేర్పుగా, రహస్యంగా దీనిని డిజైన్ చేశారు.. షర్టు ఉతికేటప్పుడు, అందులో అమర్చిన ఫ్యాన్ మరియు బ్యాటరీ భాగాలను మాత్రమే చాలా సులభంగా వేరు చేసి ఉతుక్కోవచ్చట!. దీనికి ముందు జపాన్‌లో భవన నిర్మాణ కార్మికులు, చెత్త నిర్వహణ సిబ్బంది మరియు భద్రతా సిబ్బంది ఇలాంటి ఎయిర్-కండిషన్డ్ దుస్తులను ఉపయోగించారు. కానీ అవన్నీ జాకెట్ లేదా వెస్ట్ రూపంలో మాత్రమే ఉండేవి. అయితే, ఇప్పుడు మొదటిసారిగా కార్పొరేట్ మరియు ఆఫీస్ ఉద్యోగులు ఎండలో ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్లేటప్పుడు వచ్చే చెమటను, అలసటను నివారించేలా ఈ ఫార్మల్ షర్టును తయారు చేశారు. షర్ట్ బరువు ఎక్కువగా ఉండకూడదని, ఇందులో ఉండే ప్రతి విసనకర్ర 95 గ్రాముల బరువు, రీచార్జ్ చేసుకునే బ్యాటరీ ప్యాక్ 165 గ్రాముల బరువు మాత్రమే కలిగి ఉన్నాయి. బ్లూ కలర్, గ్రే కలర్లలో M, L, XL సైజుల్లో లభించే ఈ షర్ట్, జపాన్ కరెన్సీ ప్రకారం 17,490 యెన్ల ధరకు విక్రయించబడుతోంది. ఇందులో 2 ఫ్యాన్లు, బ్యాటరీ ప్యాక్, ఛార్జింగ్ కేబుల్ మరియు షర్ట్ అన్నీ కలిసి వస్తాయి.
ホーム
/
technology
/
జపాన్ లో ఏసీ షర్ట్ ను ఆవిష్కరించిన ప్రముఖ దుస్తుల సంస్థ
Wednesday, August 5, 2026
collaborated with FZN ofuku no Aoyama Prominent Clothing Company Launches AC Shirt in Japan science technology
No comments:
Post a Comment