ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ, పూంచ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ చిన్న కుమారుడు అబాన్ అహ్మద్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతనితో పాటు మరో ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఝాన్సీ జైలులో ఖైదీగా ఉన్న తన సోదరుడు అలీ అహ్మద్‌ను కలవడానికి వారందరూ ప్రయాగ్‌రాజ్ నుంచి ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. సమాచారం ప్రకారం అతివేగంతో వస్తున్న కారు అదుపుతప్పి హైవేపై డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ధాటికి కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. మృతులలో ఒకరిగా అబాన్ అహ్మద్‌ను గుర్తించారు. ఈ ప్రమాదంలో మహమ్మద్ జైద్, ఒమర్‌తో సహా మరో ముగ్గురు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన పరిస్థితులు, కారు వేగంపైనా విచారణ జరుగుతోంది. పోలీసులు ప్రస్తుతం సంఘటనా స్థలం నుంచి ఆధారాలు సేకరిస్తున్నారు.
ホーム
/
uttarapradesh
/
రోడ్డు ప్రమాదంలో గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ కుమారుడితో సహా ఇద్దరు దుర్మరణం
Thursday, August 6, 2026
including gangster Atiq Ahmed's son killed in road accident national Poonch police station in Jhansi Two uttarapradesh
No comments:
Post a Comment