తమిళనాడు లోని వెల్లూరు లోని వీఐటీ విశ్వవిద్యాలయం 41వ స్నాతకోత్సవానికి ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత్ కృత్రిమ మేధస్సు (ఏఐ) సాంకేతికతను కేవలం వినియోగించే దేశంగా కాకుండా, సొంతంగా ఏఐను అభివృద్ధి చేసే సృష్టికర్తగా ఎదగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు, విద్యాసంస్థలు, పట్టభద్రులు కలిసి పనిచేస్తే కాలు ష్యం, ట్రాఫిక్, వ్యర్థాల నిర్వహణ వంటి సమస్యలకు పరిష్కారాలు కనుగొనవచ్చని ఆమె అన్నా రు. విద్యార్థులు వైఫల్యాలకు భయపడకుండా వాటి కారణాలను గుర్తించి పట్టుదలతో ముం దుకు సాగాలని సూచించారు. 'మేక్ ఇన్ ఇండి యా', 'డిజైన్ ఇన్ ఇండియా' వంటి లక్ష్యాలతో భారత్ సాంకేతిక రంగంలో ప్రపంచస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. వీఐటీ ఛాన్సలర్ జి. విశ్వనాథన్ మాట్లాడుతూ దేశంలో ఉన్నత విద్య లో ప్రవేశాల శాతం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. వైద్య విద్యలో సీట్ల కొరత కారణంగా ఏటా దాదాపు లక్ష మంది భారతీయ విద్యార్థులు విదేశాలకు వెళ్తున్నారని తెలిపారు. వీఐటీ స్నాతకోత్సవంలో మొత్తం 11,276 మంది విద్యార్థులకు డిగ్రీలు అందజేశారు. వీరిలో 7,359 మంది అండర్‌గ్రాడ్యుయేట్, 3,917 మంది పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఉన్నారు. 781 మంది పీహెచ్‌డీ పట్టాలు పొందగా, 84 మందికి బంగారు పతకాలు అందించారు. ఈ సందర్భంగా వీఐటీలో బ్యాక్టీరియోఫేజ్, ఇన్ఫెక్షియస్ డిసీజెస్‌పై సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రారంభించారు.
ホーム
/
technology
/
సొంతంగా ఏఐను అభివృద్ధి చేసే సృష్టికర్తగా భారత్ ఎదగాలి : ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా
الأحد، 23 أغسطس 2026
41st convocation ceremony of VIT University in Vellore India Must Emerge as a Creator of AI national Rekha Gupta Tamil Nadu technology
ليست هناك تعليقات:
إرسال تعليق