ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ బానుగుడి సెంటర్‌లో మూడు రోజుల క్రితం జరిగిన జిమ్ ట్రైనర్ సతీష్‌రెడ్డి హత్య కేసు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సతీష్‌రెడ్డిని ముగ్గురు స్నేహితులతో కలిసి సాయి కిరణ్ హత్య చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ నలుగురిని అదుపులోకి తీసుకున్న కాకినాడ టూ టౌన్ పోలీసులు విచారిస్తున్నారు. సతీష్‌రెడ్డి హత్య వెనుక ఎమ్మెల్యే కొండబాబు అనుచరుడు కటౌట్ శ్రీను ఉన్నాడని మృతుని భార్య జయశ్రీ ఆరోపిస్తుంది. వ్యక్తిగత వ్యవహారాల కారణంగా తన భర్తపై కటౌట్ శ్రీను కక్ష పెంచుకున్నాడని, దాంతోనే ఈ హత్య జరిగిందని ఆమె అంటోంది. దీనిపై కటౌట్ శ్రీను కోసం పోలీసులు గాలిస్తున్నారు.
జిమ్ ట్రైనర్ హత్య కేసు : ముగ్గురు నిందితులు అరెస్టు
السبت، 29 أغسطس 2026
Andhra Pradesh Banugudi Centre in Kakinada crime Gym Trainer Murder Case Police are currently searching for 'Cutout' Srinu in connection with the case Three accused arrested
ليست هناك تعليقات:
إرسال تعليق