ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబంపై కోడలు మేఘన ఫిర్యాదుతో గృహ హింస, వరకట్న వేధింపుల కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని జోగి రమేశ్ కుటుంబం దాఖలు చేసిన పిటిషన్‌పై విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు విచారించింది. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. బాధితురాలు మేఘనను బెదిరించడం, ప్రభావితం చేయడం లేదా ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేయకూడదని కోర్టు ఆదేశించింది. పోలీసులు విచారణకు హాజరుకావాలని సూచనలు చేసింది.

Post a Comment

أحدث أقدم