ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై కొండా సుస్మిత చేసిన అనుచిత వ్యాఖ్యలను పరిశీలించాం. మరోసారి క్రమశిక్షణ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాని తెలంగాణ కాంగ్రెస్‌ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి అన్నారు. చిన్నారెడ్డి ఇచ్చిన వివరణపై కూడా చర్చించాం. చిన్నారెడ్డి అంశంపై కూడా మరోసారి చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ''మూడు గంటల పాటు ఇటీవల పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారి వ్యవహారం పై చర్చించాం. సుస్మిత మాట్లాడిన వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించాం. కొండా సురేఖ వివరణ అందింది. కొందరు ఎమ్మెల్యేలు ఈ అంశంపై క్రమశిక్షణ కమిటీకి కంప్లైంట్ ఇస్తామని చెప్పారు. వీలైనంత త్వరలో మరో సమావేశం ఏర్పాటు చేసి కొండా సురేఖ అంశంపై నిర్ణయం తీసుకుంటాం. చిన్నారెడ్డి మాట్లాడిన విడియోను పరిశీలించాం. ఎమ్మెల్యే మేఘారెడ్డి అభిప్రాయం తీసుకున్న తర్వాత చిన్నారెడ్డి కేసులో నిర్ణయం తీసుకుంటాం. కంది శ్రీనివాస్ రెడ్డిని విచారించాం. తన వాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు'' అని మల్లు రవి తెలిపారు.

Post a Comment

أحدث أقدم