జమైకన్ మాజీ రన్నర్ ఉస్సేన్ బోల్ట్ నమోదు చేసి రికార్డును ఓ హ్యుమనాయిడ్ రోబో బ్రేక్ చేసింది. 100 మీ.ల దూరాన్ని బోల్ట్ 9.58 సెకన్లలో పూర్తి చేయగా చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ 'హానర్' తయారు చేసిన లైటెనింగ్ అనే హ్యుమనాయిడ్ రోబో కేవలం 9.32 పూర్తి చేసింది. కాగా, ఇదే ఏడాది ఏప్రిల్‌లో జరిగిన 21 కిలోమీటర్ల బీజింగ్ హాఫ్ మారథాన్ నిర్వహించారు. ఇందులో సుమారు 12 వేల మంది మనుషులు, 100కు పైగా హ్యుమనాయిడ్ రోబోలు పాల్గొన్నాయి. ఈ క్రమంలో 21 కిలోమీటర్ల దూరాన్ని 50 నిమిషాల 26 సెకన్లలో లైటనింగ్ రోబో పూర్తి చేసి రికార్డు నెలకొల్పింది. మరో రోబో 51 నిమిషాల్లో, ఇంకో రోబో 53 నిమిషాల్లో పూర్తి చేసి రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
ఉసేన్ బోల్ట్ రికార్డును బ్రేక్ చేసిన హ్యూమనాయిడ్ రోబో !
Telugu Lo Computer
0
تعليقات
إرسال تعليق