హైదరాబాద్, గచ్చిబౌలిలోని అంజయ్యనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఏడు అంతస్తుల భవనం కుప్పకూలి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. కూలిన భవన శిథిలాలు పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌ మీద పడిపోయాయి. మృతులను మధ్యప్రదేశ్‌కు చెందిన టైల్స్‌ కార్మికులు ఉమేశ్‌ కారే (34), మోపత్‌ (42)గా గుర్తించారు. నిర్మాణం పూర్తయి అద్దెలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఈ భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, ఫైర్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, జీహెచ్‌ఎంసీ సిబ్బంది.. ఇంకా శిథిలాల కింద ఎవరైనా చిక్కుకొని ఉన్నారేమోనన్న అనుమానంతో సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. ఘటనా స్థలిని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌, సైబరాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ సృజన పరిశీలించారు. ఈ భవనం నిర్మాణం చేస్తున్న బిల్డర్‌ సాజిద్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Post a Comment

أحدث أقدم