రెండేళ్ల క్రితం భర్తను వదిలి ప్రేమికుడితో పారిపోయి, చివరికి అతని చేతిలో దారుణంగా హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీహార్‌లోని నవాడా జిల్లాకు చెందిన ఛోటీ కుమారికి ఇదివరకే వివా మైంది. అయితే, తన గ్రామానికి చెందిన ప్రేమికుడు రిషభ్ కుమార్ సింగ్‌తో కలిసి దద్రా అండ్ నగర్ హవేలీలోని సిల్వాస్సాకు పారిపోయి పెళ్లి చేసుకుంది. వీరి వివాహాన్ని ఇరు కుటుంబాలు వ్యతిరేకించాయి. దీంతో రిషభ్‌పై కిడ్నాపింగ్ కేసు నమోదైంది. మరోవైపు పెళ్లయిన తర్వాత తమ సొంత ఊరికి తిరిగి వెళ్దామని ఛోటీ పదేపదే కోరడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో జూన్ 9న జరిగిన తీవ్ర వాగ్వాదం తర్వాత, రిషభ్ కోపంతో ఛోటీని గొంతు నులిమి హత్య చేశాడు. బాడీని సూట్‌కేస్‌లో కుక్కి అక్కడినుంచి పారిపోయాడు. అయితే ఆగస్టు 3న గది యజమాని వేరే వారికి అద్దెకు ఇవ్వడం కోసం తాళం పగులగొట్టి చూడగా, బాత్‌రూమ్‌లో ఉన్న సూట్‌కేస్ నుండి తీవ్ర దుర్వాసన రావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేసి, నిందితుడిని అరెస్ట్ చేశారు.
భర్తను వదిలి ప్రేమికుడితో పారిపోయిన మహిళ : హత్య చేసి, బాడీని సూట్‌కేస్‌లో కుక్కి పారిపోయిన ప్రేమికుడు
الأربعاء، 12 أغسطس 2026
and flees bihar crime Lover kills her stuffs body in suitcase Woman who eloped with lover after leaving husband
ليست هناك تعليقات:
إرسال تعليق