ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణ రావు (73) కన్నుమూశారు. ఈ విషాదకర వార్తను ప్రముఖ నటి కరాటే కల్యాణి సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించారు. సుమారు నాలుగు దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులను తనదైన నటనతో అలరించిన ఆయన మృతి పట్ల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా కురుమద్దాలి గ్రామంలో జన్మించిన నారాయణ రావు బాల్యం, విద్యాభ్యాసం అంతా అనంతపురం జిల్లా గుంతకల్లులో సాగింది. కళల పట్ల చిన్ననాటి నుంచే ఆసక్తి ఉన్న ఆయన గిడుగు విశాలాక్షి వద్ద భరతనాట్యం, నటరాజ రామకృష్ణ వద్ద కూచిపూడి నృత్యం నేర్చుకున్నారు. అలాగే ఎ.ఆర్.కృష్ణ వద్ద నటనలో మెళకువలు గ్రహించారు. విద్యార్థి దశలోనే నాటక రంగంపై మక్కువ పెంచుకుని 'మహమ్మద్ బీన్ తుగ్లక్', 'ప్రతాపరుద్రీయం', 'మంచుతెర' వంటి ప్రతిష్ఠాత్మక నాటకాలలో అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు. మద్రాస్ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో నటనలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న నారాయణరావుకు అక్కడ సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవిలతో విడదీయరాని స్నేహబంధం ఏర్పడింది. 1976లో లెజెండరీ దర్శకుడు కె.బాలచందర్ రూపొందించిన క్లాసిక్ హిట్ 'అంతులేని కథ' చిత్రం ద్వారా ఆయన వెండితెరకు పరిచయమయ్యారు. తొలి సినిమాలోనే తన అద్భుత నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డును సొంతం చేసుకున్నారు. తన కెరీర్లో 100కు పైగా చిత్రాల్లో నటించిన ఆయన 'ముత్యాల పల్లకి', 'అంగడి బొమ్మ', 'చిలకమ్మ చెప్పింది', 'గ్యాంగ్ లీడర్', 'హిట్లర్' తదితర చిత్రాలతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు. కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగానూ జీవీ నారాయణ రావు టాలీవుడ్‌లో విజయాలు అందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవితో నిర్మించిన బ్లాక్ బస్టర్ మూవీ 'యముడికి మొగుడు'తో పాటు, 'దేవాంతకుడు', 'ఇంటికో రుద్రమ్మ', 'పెళ్ళి నీకు శుభం నాకు' వంటి హిట్ చిత్రాలను ఆయన నిర్మించారు. సినిమాలతో పాటు బుల్లితెరపై కూడా పలు సీరియళ్లలో నటించి టీవీ ప్రేక్షకులకు సైతం చేరువయ్యారు.
సీనియర్ నటుడు నారాయణ రావు కన్నుమూత
الخميس، 27 أغسطس 2026
Andhra Pradesh cinema Karate Kalyani officially announced this sad news via social media Senior Actor Narayana Rao Passes Away telangana
ليست هناك تعليقات:
إرسال تعليق