అమెరికాలో 15 రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో 75 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చేరిన హన్మకొండ జిల్లా విద్యార్థి మృత్యువుతో పోరాడి కన్నుమూశాడు. వివరాల్లోకి వెళ్లే హసన్‌పర్తి మండలం గంటూర్‌పల్లికి చెందిన భరత్ చందర్ ఉన్నత విద్య కోసం 2023లో అమెరికా వెళ్లాడు. ఫ్లోరిడాలోని టాంపాలో ఉంటున్నారు. చదువు పూర్తవ్వడంతో ఇండియాకు వచ్చి పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు. కానీ ఇంతలోనే అగ్నిప్రమాదానికి గురయ్యాడు. గత నెల 25వ తేదీన జరిగిన ఫైర్ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడ్డాడు. దాదాపు 75 శాతం శరీరం కాలడంతో అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడే 15 రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న భరత్.. తుదిశ్వాస విడిచారు.
అమెరికాలో అగ్ని ప్రమాదంలో చికిత్స పొందుతూ తెలుగు విద్యార్థి మృతి
الأربعاء، 12 أغسطس 2026
burns covering 75 percent of his body student from Hanamkonda district telangana Telugu Student Dies After Sustaining Severe Burns in US Fire Accident
ليست هناك تعليقات:
إرسال تعليق