దేశ రాజకీయాల్లో తాజాగా పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. రెండేళ్ల క్రితం వరుసగా మూడోసారి లోక్ సభ ఎన్నికల్లో నెగ్గి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నరేంద్ర మోడీ ప్రస్తుతం పెను సవాళ్లు ఎదుర్కొంటున్నారు. నీట్ అక్రమాల నేపథ్యంలో విద్యార్ధులు మొదలుపెట్టిన ఉద్యమాలు ఇప్పుడు ఏకంగా ఒక్కో రాష్ట్రానికీ విస్తరిస్తున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీని తక్కువ అంచనా వేసిన కేంద్రానికి.. ఆ తర్వాత వారితోనే చర్చలు జరపాల్సిన పరిస్ధితి ఎదురైంది. ఢిల్లీ నిరసనల తర్వాత జార్ఖండ్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో విద్యార్ధులు, హర్యానాలో రైతులు రోడ్డెక్కుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే ప్రజలు ఎవరికి ఓటేస్తారన్న దానిపై పోల్ ట్రాకర్ సంస్థ సర్వే నిర్వహించింది. ఇందులో ఇప్పటికిప్పుడు దేశంలో లోక్ సభ ఎన్నికలు నిర్వహిస్తే అధికార ఎన్డీయే కూటమికి కేవలం 240 స్ధానాలు మాత్రమే దక్కనున్నట్లు తేలిపోయింది. అలాగే విపక్ష ఇండియా కూటమికి 280 సీట్లు లభిస్తాయని పోల్ ట్రాకర్ అంచనా వేసింది. ఇతరులకు 23 సీట్లు దక్కవచ్చని తెలిపింది. ఎన్డీయేకు ప్రస్తుతం లోక్ సభలో 293 సీట్లు ఉండగా, ఇండియా కూటమికి 234 సీట్లు ఉన్నాయి. ఇతరులకు 16 సీట్లు ఉన్నాయి.
ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు నిర్వహిస్తే ఇండియా కూటమికి 280 సీట్లు : పోల్ ట్రాకర్ సంస్థ సర్వే
الأربعاء، 12 أغسطس 2026
'INDIA' alliance would secure 280 seats if Lok Sabha elections were held now 'Others' securing 23 seats national NDA alliance would secure only 240 seats Poll Tracker survey
ليست هناك تعليقات:
إرسال تعليق