జూలైలో 600 మంది గర్భిణుల వీసాలను రద్దు చేసిన అమెరికా

الخميس، 13 أغسطس 2026

international majority of these women arrived in the US during their ninth month of pregnancy US Revokes Visas of 600 Pregnant Women in July US Secretary of State Marco Rubio revealed

t f B! P L

జూలైలో దాదాపు 600 మంది గర్భిణుల వీసాలను రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో వెల్లడించారు. మార్కో రుబియో తెలిపిన వివరాల ప్రకారం, వీసాలు రద్దైన మహిళలు ఎక్కువగా గర్భధారణ తొమ్మిదో నెలలో అమెరికాకు చేరుకున్నవారే. వీరు అమెరికాలో బిడ్డకు జన్మనిచ్చి, అక్కడి పౌరసత్వం పొందే ఉద్దేశంతో వచ్చినట్లు అధికారులు అనుమానించారు. దీంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బర్త్ టూరిజం టాస్క్ ఫోర్స్ వారి వీసాలను సమీక్షించి రద్దు చేసింది. కొత్త వీసా నిబంధనల ప్రభావం అంతర్జాతీయ విద్యార్థులపై కూడా కనిపిస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఫాల్ సీజన్‌లో అమెరికాకు వెళ్లిన విదేశీ విద్యార్థుల సంఖ్య సుమారు 1.12 లక్షలు తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. తాజా చర్యలతో అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసే వారి ప్రయాణ ఉద్దేశాలు, సమర్పించే పత్రాలు, ఇతర వివరాలపై ఇమ్మిగ్రేషన్ అధికారులు మరింత కఠినంగా పరిశీలించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ