ఆగస్టు 4న పోకో M8 పవర్, ఆగస్టు 6న రెడ్‌మీ నోట్ 17 విడుదల

Sunday, August 2, 2026

000mAh batteries and impressive OLED screens 8 Poco M8 Power Launching August 4 Redmi Note 17 Launching August 6 technology

t f B! P L

ఆగస్టు 4న ఫ్లిప్‌కార్ట్ వేదికగా పోకో M8 పవర్ విడుదలవుతుండగా, ఆగస్టు 6న రెడ్‌మీ నోట్ 17 మార్కెట్లోకి రాబోతున్నాయి. ఈ రెండు ఫోన్లలోనూ 8,000mAh భారీ బ్యాటరీతో పాటు అదిరిపోయే OLED స్క్రీన్స్‌ను అందించారు. ముఖ్యంగా స్టూడెంట్స్, హెవీ యూజర్లను దృష్టిలో ఉంచుకుని వీటిని డిజైన్ చేశారు. సాధారణంగా పెద్ద బ్యాటరీ ఉంటే ఫోన్లు బరువుగా, పట్టుకోవడానికి ఇబ్బందిగా అనిపిస్తాయి. కానీ, ఈ కంపెనీలు బరువును సమానంగా పంపిణీ చేస్తూ చేతిలో పట్టుకోవడానికి వీలుగా వీటిని రూపొందించాయి. పోకో M8 పవర్ రఫ్ అండ్ టఫ్ వాడకానికి బాగుంటే.. రెడ్‌మీ నోట్ 17 స్టైలిష్‌గా, స్లిమ్‌గా ఉంటుంది. కళ్లపై ఒత్తిడి పడకుండా ఉండేందుకు రెండింటిలోనూ PWM డిమ్మింగ్ ఫీచర్‌ను ఇచ్చారు. మల్టీ టాస్కింగ్, గేమింగ్ కోసం ఈ ఫోన్లలో పవర్‌ఫుల్ చిప్‌సెట్లను వాడారు. పోకోలో క్వాల్కమ్ ప్రాసెసర్ ఉండటంతో BGMI వంటి గేమ్స్ స్మూత్‌గా ఆడొచ్చు. ఇక రెడ్‌మీ నోట్ 17లో హీటింగ్ సమస్యలు రాకుండా కొత్త టెక్నాలజీని వాడారు. అయితే, ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు లేదా ఎక్కువ సేపు గేమింగ్ ఆడినప్పుడు పర్ఫార్మెన్స్‌లో కాస్త మార్పులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫ్రేమ్ రేట్ స్థిరంగా ఉందో లేదో గమనించాలి. ఫోన్ కొనేటప్పుడు మనవాళ్లు ముందుగా చూసేది కెమెరానే. వీడియోలు షేక్ అవ్వకుండా ఉండేందుకు రెండింటిలోనూ EIS ఫీచర్ ఉంది. పోకో ఫోన్ పగటిపూట నేచురల్ స్కిన్ టోన్స్‌తో ఫోటోలు తీస్తే.. రెడ్‌మీ తక్కువ వెలుతురులోనూ మంచి పోర్ట్రెయిట్ షాట్స్ ఇస్తుంది. ఇక జియో యూజర్ల కోసం n77, n78 వంటి కీలకమైన 5G బ్యాండ్లను కూడా ఈ రెండు డివైజ్‌లు సపోర్ట్ చేస్తాయి.


Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    Featured Post

    QooQ