నేపాల్ వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతైనట్టు కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది. తమిళనాడు-37, కేరళ 33, బెంగాల్‌కు చెందిన 32 మంది, మహారాష్ట్రకు చెందిన 7, ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మంది మిస్సింగ్ అయ్యారు. త్రిశూలీ-1 ప్రాజెక్ట్ సిబ్బంది 73 మంది గల్లంతయ్యారు. ఈషా ఫౌండేషన్‌కు చెందిన 80 సభ్యులు వరదల్లో గల్లంతయినట్లు భారత విదేశాంగశాఖ తెలిపింది. ఇప్పటివరకు 21 మంది భారతీయులను రక్షించామని కేంద్రం పేర్కొంది. కాగా, నేపాల్‌లో ఇషా ఫౌండేషన్ సేక్రెడ్ వాక్స్ పేరుతో కైలాస్ మానస సరోవర్ యాత్ర చేపట్టగా.. వరదలు ముంచెత్తడంతో పర్యాటకులు, వాలంటీర్లు కనిపించకుండా పోయారు. దీంతో ఇషా ఫౌండేషన్‌లో విషాదం నెలకొంది. ''మా బృందం ఖాట్మండుకు తిరుగు ప్రయాణంలో చైనా ఇమ్మిగ్రేషన్ సెంటర్‌లో ఉన్నారు. ఉదయం 9:05కి గ్రూప్ లీడర్ ప్రవీణ్‌తో చివరిగా మాట్లాడాం. ఇమ్మిగ్రేషన్ ప్రారంభిస్తున్నామన్నారు. 10 నిమిషాల్లోనే సంప్రదింపులు తెగిపోయాయి. 10 నిమిషాల్లోనే ఈ విషాదం జరిగింది. మొత్తం కమ్యూనికేషన్ సిస్టమ్ డౌన్ అయ్యింది. నేపాల్ వైపు కమ్యూనికేషన్ పూర్తిగా ఆగిపోయింది. నేపాల్ వైపు మా వాలంటీర్లు ఉన్న పట్టణం పూర్తిగా కొట్టుకుపోయింది.'' అని ఇషా ఫౌండేషన్ తెలిపింది.
నేపాల్ వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతు : కేంద్రం ప్రభుత్వం ప్రకటన
الخميس، 27 أغسطس 2026
288 Indians Missing in Nepal Floods 32 from Bengal 33 from Kerala 37 from Tamil Nadu 7 from Maharashtra and 61 from other states Central Government Statement national
ليست هناك تعليقات:
إرسال تعليق