జొమాటో కస్టమర్ సపోర్ట్ సెంటర్‌ మూసివేత : హైదరాబాద్ ఆఫీసులో పనిచేస్తున్న సుమారు 250 మంది ఉద్యోగులను తొలగింపు

الاثنين، 31 أغسطس 2026

Around 250 Employees at Hyderabad Office Laid Off business national Zomato Closes Customer Support Center

t f B! P L

జొమాటో తన కస్టమర్ సపోర్ట్ సెంటర్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. మూసివేతలో భాగంగా హైదరాబాద్ ఆఫీసులో పనిచేస్తున్న సుమారు 250 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఆ కంపెనీ వెల్లడించింది. కేవలం ఖర్చులు తగ్గించుకోవడం కోసమే కాకుండా.. పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ లేఆఫ్స్ చేపట్టినట్లు ప్రకటించింది. హైదరాబాద్‌లో సెంటర్‌ను మూసివేస్తున్నప్పటికీ.. జొమాటో తన ఇన్-హౌస్ కస్టమర్ సపోర్ట్ ఆపరేషన్స్‌ను పూర్తిగా ఆపలేదని జొమాటో ప్రకటించింది. వీటిని హర్యానాలోని గురుగ్రామ్‌లో ఉన్న తన హెడ్ ఆఫీసుకు మారుస్తున్నట్లు ప్రకటించింది. ప్రొడక్ట్, టెక్నాలజీ, అనలిటిక్స్ వంటి కీలక విభాగాలకు కస్టమర్ సపోర్ట్ టీమ్ లను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు జొమాటో కంపెనీ ప్రకటించింది. గత 6 నెలలుగా కస్టమర్ కేర్ బాధ్యతలను బయటి సంస్థలకు అవుట్‌సోర్సింగ్ చేయడం కూడా క్రమంగా పెరుగుతోన్న నేపథ్యంలో ఫుడ్ డెలవరీ కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో ఉద్యోగం కోల్పోతున్న సిబ్బందికి జొమాటో తగిన భద్రత కల్పిస్తున్నట్లు తెలిసింది. ఉద్యోగులకు ఆగస్ట్ నెల పూర్తి జీతంతో పాటు కాంట్రాక్ట్ నోటీస్ పే, ఒకేసారి చెల్లించే ఎక్స్-గ్రేషియా కలిపి మొత్తం 4 నెలల వేతనాన్ని సెవెరెన్స్ ప్యాకేజీ కింద చెల్లిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఉద్యోగం నుంచి రిలీజైన తర్వాత కూడా మార్చి 31, 2027 వరకు మెడికల్ ఇన్సూరెన్స్, కౌన్సెలింగ్ సపోర్ట్ కొనసాగించుకునే వెసులుబాటు జొమాటో కల్పించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీలు కస్టమర్ సపోర్ట్ కోసం భారీ ఇన్-హౌస్ టీమ్‌లను ఉంచుకోవడానికి బదులుగా ఏఐ, ఆటోమేషన్, థర్డ్-పార్టీ సర్వీస్ ప్రొవైడర్లపై ఎక్కువగా ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. ఇదే ట్రెండ్ కొనసాగుతుండటంతో కస్టమర్ కేర్ ఉద్యోగులపై వేటు పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది ఏప్రిల్ 2025లోనూ జొమాటో సుమారు 500 మంది జూనియర్ స్థాయి ఉద్యోగులను తొలగించింది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ