స్మార్ట్‌వాచ్‌ల మార్కెట్‌లో అగ్రగామిగా ఉన్న భారతీయ బ్రాండ్ 'ఫైర్-బోల్ట్' ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ రంగాల్లోకి అడుగు పెట్టింది.'బోల్ట్' బ్రాండ్‌తో ఈ ఫోన్‌లను మార్కెట్లోకి తెస్తోంది. ఆగస్టు 25న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్ వేదికగా ఇవి గ్రాండ్‌గా లాంచ్ కానున్నాయి. రూ.20,000 లోపు బడ్జెట్ ధరలోనే 4G, 5G స్మార్ట్‌ఫోన్‌లను వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా కంపెనీ ముందుకెళ్తోంది. తొలి విడతలో 'బోల్ట్ ఏస్ 5జీ', 'బోల్ట్ ఈవో 4జీ' పేర్లతో రెండు మోడళ్లను విడుదల చేస్తున్నారు. ఎలాంటి విసుగుతెప్పించే యాడ్స్, అనవసరమైన బ్లోట్‌వేర్ యాప్స్ లేకుండా క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఈ ఫోన్లు అందించనున్నాయి. వీటిలో ఏకంగా 6,000mAh భారీ బ్యాటరీతో పాటు బాక్స్‌లోనే 18W ఫాస్ట్ ఛార్జర్‌ను ఇస్తున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. వినియోగదారులకు వేగవంతమైన ఆఫ్టర్-సేల్స్ సర్వీస్ అందించేందుకు దేశవ్యాప్తంగా 400కి పైగా సర్వీస్ సెంటర్లను ఫైర్-బోల్ట్ సిద్ధం చేసింది. ఫ్లిప్‌కార్ట్ ఆన్‌లైన్ సేల్స్‌తో పాటు ఆఫ్‌లైన్ నెట్‌వర్క్ ద్వారా చిన్న పట్టణాల వినియోగదారులకు కూడా ఈ ఫోన్‌లను చేరువ చేయనుంది.
ホーム
/
technology
/
స్మార్ట్‌ఫోన్ రంగాల్లోకి అడుగు పెట్టిన ఫైర్-బోల్ట్ : ఆగస్టు 25న బోల్ట్ ఏస్ 5జీ, 'బోల్ట్ ఈవో 4జీ విడుదల
الجمعة، 21 أغسطس 2026
'Bolt Ace 5G' 'Bolt Evo 4G' Launching on August 25 business Fire-Boltt Enters the Smartphone Market national technology
ليست هناك تعليقات:
إرسال تعليق