దేశంలో విద్యార్ధుల చదువులకూ, వారు చేస్తున్న ఉద్యోగాలకూ మధ్య తీవ్ర అసమానత ఉందని నీతి ఆయోగ్ తన నివేదికలో పేర్కొంది. ఇదో ప్రమాదకర సంకేతంగా తెలిపింది. గతంతో పోలిస్తే మన దేశం ఇప్పుడు భారీ ఎత్తున గ్రాడ్యుయేట్లను తయారు చేస్తోంది. అయినా విద్యార్ధులు చదివిన దానికీ, వాస్తవంగా వారు చేస్తున్న ఉద్యోగాలకూ సంబంధం ఉండటం లేదని నీతి ఆయోగ్ తెలిపింది. విద్యార్ధుల డిగ్రీల్ని ఉద్యోగాలుగా మార్చడంలో దేశం ఇబ్బంది పడుతోందని నీతి ఆయోగ్ తాజాగా ప్రచురించిన పత్రంలో పేర్కొంది. ఇక్కడ సమస్య కేవలం నిరుద్యోగం మాత్రమే కాదని, విద్య, నైపుణ్యాలు, ఉద్యోగ మార్కెట్ మధ్య ఉన్న ఒక లోతైన అసమతుల్యత అని వెల్లడించింది. 'రీఇమాజినింగ్ స్కిల్లింగ్ ఫర్ విక్సిత్ భారత్ @2047' అనే టైటిల్ తో తయారు చేసిన ఈ పత్రంలో నీతి ఆయోగ్.. కేవలం 8.25% మంది పట్టభద్రులు మాత్రమే వారి అర్హతలకు అనుగుణమైన ఉద్యోగాలలో ఉపాధి పొందుతున్నారని తేల్చే చెప్పింది. దేశంలో 3 కోట్ల మంది డిగ్రీలు చదువుతుంటే, అందులో 2 కోట్ల మంది బీఎస్సీ, బీఏ, బీకామ్ లో చదువుతున్నారని, దీనికి కారణం ప్రభుత్వ నియామకాలకు ఇవి అర్హత అవుతాయని భావించడమే అని నీతి ఆయోగ్ తేల్చింది.
కేవలం 8.25% పట్టభద్రులు మాత్రమే అర్హతకు తగ్గ ఉద్యోగం ఉపాధి పొందుతున్నారు : నీతి ఆయోగ్ నివేదిక
الجمعة، 21 أغسطس 2026
describing this as an alarming sign national NITI Aayog Report Only 8.25% of graduates are employed in jobs commensurate with their qualifications
ليست هناك تعليقات:
إرسال تعليق