గచ్చిబౌలి హాకీ స్టేడియానికి ఎఫ్‌ఐహెచ్‌ కేటగిరీ-1 సర్టిఫికేషన్

الأربعاء، 19 أغسطس 2026

FIH Category-1 Certification for Gachibowli Hockey Stadium hyderabad only active hockey turf in the country to hold FIH Category-1 certification sports telangana

t f B! P L

హైదరాబాద్ లోని  గచ్చిబౌలి హాకీ స్టేడియానికి అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రతిష్ఠాత్మక కేటగిరీ-1 ఫీల్డ్ సర్టిఫికేషన్ లభించింది. దీంతో ప్రస్తుతం దేశంలో FIH కేటగిరీ-1 ధృవీకరణ పొందిన ఏకైక లైవ్ హాకీ టర్ఫ్‌గా గచ్చిబౌలి హాకీ స్టేడియం నిలిచింది. సర్టిఫికేషన్‌లో భాగంగా ఎఫ్‌ఐహెచ్‌ నిర్వహించిన సమగ్ర ఫీల్డ్, పనితీరు పరీక్షల్లో స్టేడియం అంతర్జాతీయ ప్రమాణాలను విజయవంతంగా అందుకుంది. టర్ఫ్ నాణ్యత, బంతి కదలిక, ఆటగాళ్ల భద్రత, ఆట నాణ్యత, మన్నిక తదితర అంశాల్లో నిర్దేశిత ప్రమాణాలను పూర్తి చేసింది. అంతర్జాతీయ, టెలివిజన్ ప్రసార మ్యాచ్‌లకు కీలకమైన ఫీల్డ్ లైటింగ్‌ను కూడా ఎఫ్‌ఐహెచ్‌ పరిశీలించి, TV3 స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు ధృవీకరించింది. దీంతో అంతర్జాతీయ స్థాయి టెలివిజన్ ప్రసార హాకీ పోటీలకు ఈ స్టేడియం అనుకూలంగా మారింది. ఇటీవల మార్చి 8 నుంచి 13 వరకు గచ్చిబౌలి స్టేడియంలో ఇంటర్నేషనల్ ఉమెన్స్ హాకీ క్వాలిఫయర్ మ్యాచ్‌లు విజయవంతంగా నిర్వహించడాన్ని అనుసరించి ఈ ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అధికారులు సమన్వయంతో కృషి చేసి, రికార్డు సమయంలో స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసి సిద్ధం చేశారు. ఎఫ్‌ఐహెచ్‌ కేటగిరీ-1 సర్టిఫికేషన్ తెలంగాణలోని క్రీడా మౌలిక వసతులకు గణనీయమైన గుర్తింపుగా నిలవడంతో పాటు, గచ్చిబౌలి హాకీ స్టేడియాన్ని దేశంలోని ప్రముఖ అంతర్జాతీయ హాకీ వేదికల్లో ఒకటిగా మరింత బలోపేతం చేసింది. భవిష్యత్తులో మరిన్ని ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ హాకీ పోటీలకు ఆతిథ్యం ఇచ్చే సామర్థ్యాన్ని ఈ గుర్తింపు మరింత పెంచింది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ