దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ వ్యవహారం ప్రస్తుతం . కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలతో పాటు విద్యార్థులు కూడా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. కొందరు ధర్మేంద్ర ప్రధాన్ కుటుంబ సభ్యులను కూడా విమర్శిస్తున్నారు. తాజాగా ధర్మేంద్ర ప్రధాన్ కుమార్తె నైమిషా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డీయాక్టివేట్ చేశారు. నైమిషా ప్రధాన్ అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రంలోని టఫ్ట్స్ యూనివర్సిటీలో 2023లో మాస్టర్ ఆఫ్ లా పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె.. యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ఫోరమ్ లో సీనియర్ అసోసియేట్‌గా పనిచేస్తున్నారు. తండ్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ నైమిషా విదేశాల్లో తన విద్యను పూర్తి చేయడంపై నెటిజన్లు తీవ్రంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇటీవలి విద్యార్థుల ఆందోళనల తర్వాత ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్టులపై పెద్దఎత్తున ట్రోలింగ్ మొదలైంది. ఆమె చదివిన విశ్వవిద్యాలయం సోషల్ మీడియా పేజీల్లో కూడా కొందరు విమర్శలు చేశారు. దీంతో నైమిషా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డీయాక్టివేట్ చేశారు. ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేయడం సమంజసమే అయినప్పటికీ, ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడం సరికాదని పలువురు అభిప్రాయపడ్డారు. రాజకీయ విమర్శలు ప్రజాప్రతినిధులకే పరిమితం కావాలని చాలా మంది సూచించారు.
ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను డీయాక్టివేట్ చేసిన నైమిషా ప్రధాన్
الخميس، 23 يوليو 2026
Naimisha completed her Master of Laws at Tufts University in Massachusetts Naimisha Pradhan Deactivates Instagram Account national USA
ليست هناك تعليقات:
إرسال تعليق