ట్రోఫీ ప్రదానోత్సవానికి ట్రంప్‌ : ప్రేక్షకుల నుంచి నిరసన నినాదాలు :వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌

الاثنين، 20 يوليو 2026

"He handed over the trophy but wanted to be in the photo." Boos from the Crowd Netizens are making lighthearted comments such as Trump at Trophy Presentation Videos Go Viral on Social Media

t f B! P L

ఫిఫా వరల్డ్‌కప్‌ ను స్పెయిన్‌ రెండోసారి ముద్దాడింది. మ్యాచ్‌ అనంతరం న్యూయార్క్‌- న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ట్రోఫీ ప్రదానోత్సవానికి ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినోతో కలిసి ట్రంప్‌ మైదానంలోకి వచ్చారు. అయితే ట్రంప్‌ ఎంట్రీకి ప్రేక్షకుల్లోని ఓ వర్గం నుంచి భారీగా 'బూస్‌' (నిరసన నినాదాలు) వినిపించాయి. కొద్దిసేపటికే ప్రేక్షకులు చల్లబడ్డా, ఆ తర్వాత జరిగిన పరిణామం మాత్రం వైరల్‌గా మారింది. స్పెయిన్‌ కెప్టెన్‌ రోడ్రికి ట్రంప్‌ వరల్డ్‌కప్‌ ట్రోఫీ అందించారు. సాధారణంగా ట్రోఫీ అందుకున్న కెప్టెన్‌ తన జట్టుతో కలిసి దానిని ఎత్తి సంబరాలు చేసుకుంటాడు. అదే సమయంలో ట్రంప్‌ అక్కడి నుంచి తప్పుకోవాల్సి ఉండగా కొద్దిసేపు ఆటగాళ్ల మధ్యే నిలబడి ఉన్నారు. దీంతో అధికారులు సంకేతాలు ఇవ్వడంతో ట్రంప్‌ పక్కకు జరిగారు. ఆ తర్వాత రోడ్రి తన సహచరులతో కలిసి ప్రపంచకప్‌ ట్రోఫీని పైకెత్తి ఘనంగా సంబరాలు చేసుకున్నారు. ఈ చిన్న ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వేగంగా వైరల్‌ అయ్యాయి. ''ట్రోఫీ ఇచ్చారు కానీ ఫోటోలో ఉండాలనుకున్నారు'' అంటూ నెటిజన్లు సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ ఘటనపై గతంలో జరిగిన క్లబ్‌ వరల్డ్‌కప్‌ ఫైనల్‌ ట్రోఫీ వేడుకను కూడా పలువురు గుర్తు చేస్తున్నారు. అప్పట్లోనూ ట్రంప్‌ విజేత జట్టు ఆటగాళ్లతో కలిసి స్టేజ్‌పై ఎక్కువసేపు ఉండటంపై చర్చ జరిగింది. అయితే ఈసారి ఫిఫా ప్రోటోకాల్‌ ప్రకారం చివరకు ఆయన పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ