హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ఆరు ప్రముఖ ఆహార సంస్థల్లో హెచ్-ఫాస్ట్ బృందాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పలు సంస్థల గుట్టును ఈ తనిఖీల్లో రట్టు చేశారు. ఈ దాడుల్లో భాగంగా అధికారులు దిగ్భ్రాంతికర విషయాలను గుర్తించారు. హోటళ్లు, ఆహార సంస్థల్లో విచ్చలవిడిగా వాడుతున్న రీ-యూజ్డ్ వంట నూనె, ప్రమాదకరమైన కృత్రిమ రంగులు, నాణ్యత లేని అసురక్షిత ఆహార పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు ప్యాక్ చేసిన గడువు ముగిసిన ప్రొడక్ట్స్, మార్కెట్లో లభించే ప్రముఖ బ్రాండ్ల పేరుతో చలామణీ అవుతున్న నకిలీ ఆహార ఉత్పత్తుల విక్రయాలను గుర్తించి తక్షణమే సీజ్ చేశారు. కనీస ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ పాటించకపోవడమే కాకుండా, భారతీయ ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ నుంచి ఎలాంటి అధికారిక లైసెన్స్ లేకుండానే ఈ ఆహార వ్యాపారాలను నిర్వహిస్తున్నట్లు అధికారులు తేల్చారు. నిబంధనలను బేఖాతరు చేసిన ఆరుగురు సంస్థల నిర్వాహకులపై ఫుడ్ సేఫ్టీ అధికారులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అలాగే, ఆయా కేంద్రాల నుంచి సేకరించిన ఆహార నమూనాలను తదుపరి ల్యాబ్ పరీక్షల కోసం ప్రభుత్వ ప్రయోగశాలకు పంపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్‌లో హెచ్-ఫాస్ట్ బృందాలు ఆకస్మిక తనిఖీలు : ఆరు సంస్థలపై క్రిమినల్ కేసు నమోదు
الاثنين، 20 يوليو 2026
Cases Registered Against Six Establishments H-FAST Teams Conduct Surprise Inspections in Hyderabad hazardous artificial colors repeatedly reused cooking oil
ليست هناك تعليقات:
إرسال تعليق