భివండిలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం : ఆరుగురు మృతి, శిథిలాల కింద చిక్కుకొన్న మరికొందరు

الجمعة، 31 يوليو 2026

building housed approximately 45 rooms Four-story building collapses in Bhiwandi maharashtra national others trapped under debris Six dead Thane district

t f B! P L

హారాష్ట్రలోని థానే జిల్లా భివండి లో నాలుగు అంతస్తుల నివాస భవనం అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే జాతీయ విపత్తు స్పందన దళం, రాష్ట్ర విపత్తు స్పందన దళం బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేశాయి. బుధవారం అర్ధరాత్రి భవనంలో మరమ్మతు పనులు జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా భవనం ఒకవైపునకు ఒరిగినట్లు గుర్తించారు. ప్రమాదాన్ని పసిగట్టిన కొందరు కార్మికులు వెంటనే బయటకు పరుగులు తీయడంతో పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం తప్పిందని అధికారులు తెలిపారు. శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీయడంతో పాటు, ఒక మహిళను సజీవంగా రక్షించి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తిని పడుకున్న సమయంలో భారీ శబ్దం రావడంతో మొదటి అంతస్తు నుంచి కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నామని బాధితులు తెలిపారు. మరికొందరు తమ కుటుంబ సభ్యులు కనిపించకుండా పోయారని ఆందోళన చెందుతున్నారు. ఈ  భవనంలో సుమారు 45 గదులు ఉన్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 25 నుంచి 30 మంది భవనంలో ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ