భార్య వేధింపులు భరించలేక ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. బంగారు ఆభరణాలు తీసుకరావాలని, తల్లిదండ్రులను కలువకూడదంటూ మానసికంగా హింసించడంతోనే తన కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడని తండ్రి ఆరోపిస్తున్నాడు. కరీంనగర్‌రూరల్ పోలీసుల వివరాల ప్రకారం.. కొత్తపల్లి (హవేలి)కి చెందిన కళ్యాణం రవి కుమారుడు రాకేశ్ (27) హైదరాబాద్‌కు చెందిన సంజన అలియాస్ వర్షను 2024లో ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. తీగలగుట్టపల్లిలోని సరస్వతినగర్‌లో నివాసముంటున్నారు. కొంతకాలంగా తల్లిదండ్రులను కలవకుండా రాకేశ్‌ను సంజనా మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. సెల్‌ఫోన్‌లో సైతం మాట్లాడకుండా వేధింపులకు గురిచేయడంతో భరించలేక రాకేశ్ శనివారం మధ్యాహ్నం 3.30గంటలకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు.
భార్య వేధింపులు భరించలేక భర్త ఆత్మహత్య
الاثنين، 6 يوليو 2026
crime father alleges that his son was driven to suicide due to mental abuse inflicted by the wife Husband Commits Suicide Unable to Bear Wife's Harassment telangana
ليست هناك تعليقات:
إرسال تعليق