పాముకాటుకు భార్య మృతి, భర్త పరిస్థితి విషమం

الأربعاء، 1 يوليو 2026

Bodagattu village family was asleep after dinner Husband in Critical Condition Medak district Tekmal Mandal telangana Wife Dies of Snakebite

t f B! P L

తెలంగాణలోని మెదక్‌ జిల్లా టేక్మాల్‌ మండలం బోడగట్టు గ్రామంలో  పాముకాటు వల్ల భార్య మృతి చెందగా, భర్త పరిస్థితి విషమంగా మారింది. పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ కథనం మేరకు వివరాలు టేక్మాల్ మండలం పాపన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బోడగట్టు గ్రామానికి చెందినమల్లయ్య గారి కవిత (35) సంగమేష్ దంపతులు వ్యవసాయదారులు. మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనాలు ముగించుకుని ఇంటిలో నిద్రిస్తుండగా భార్యభర్తలకు నల్ల కట్ల పాము కాటు వేసింది. ఈ విషయం బాధితులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో పామును గుర్తించి చంపేశారు . పాము కాటుకు గురైన ఇరువురిని చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం భార్య కవిత మృతి చెందగా, భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు. ఈ విషయమై మృతురాలు మామ దుర్గయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

Advertisement

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    Featured Post

    QooQ