ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శనివారం పరామర్శించారు. ముంబయిలో కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ కల్యాణ్, ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయి ప్రస్తుతం హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. నేరుగా పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌తో నారా లోకేష్ కాసేపు ముచ్చటించారు. పవనన్న.. మీరు త్వరగా కోలుకోవాలి అని లోకేష్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. డిప్యూటీ సీఎం భుజానికి అయిన గాయం, ఆ తర్వాత తలెత్తిన సమస్యలు, ముంబయిలో జరిగిన సర్జరీ వివరాల గురించి లోకేష్ అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, కచ్చితంగా వైద్యుల సూచనలు పాటించడంతో పాటు వీలైనంత వరకు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని లోకేష్ ఈ సందర్భంగా సూచించారు.
పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన నారా లోకేష్
السبت، 18 يوليو 2026
Andhra Pradesh Lokesh visited Pawan Kalyan's home to inquire about his health Nara Lokesh Calls on Pawan Kalyan spent some time conversing with him
ليست هناك تعليقات:
إرسال تعليق