ఇంట్లో అనుమానాస్పద స్థితిలో చీరతో ఉరివేసుకుని వ్యక్తి మృతి

హైదరాబాద్, జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీజార్‌నగర్‌లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇంట్లో ఉరివేసుకున్న స్థితిలో వ్యక్తి కనిపించగా, సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  ఎల్. గణేష్ ముదిరాజ్ అనే వ్యక్తి ఇంట్లో చీరతో ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, గ్రామంలో భూమి వివాదం నేపథ్యంలో ఇటీవల స్వగ్రామానికి వెళ్లిన గణేష్ అనంతరం  పిన్ని ఇంట్లో ఉన్నాడు. సోమవారం ఉదయం ఇంటికి వచ్చిన బంధువులు తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించి లోపలికి వెళ్లగా, బెడ్‌రూమ్‌లో గణేష్ ఉరివేసుకున్న స్థితిలో కనిపించాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న జవహర్‌నగర్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతికి గల కారణాలపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Post a Comment

0 Comments