సాయికృష్ణ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెన్షన్‌కు గురైన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు తన కస్టడీ విచారణ సందర్భంగా కోర్టుకు సంచలన లేఖ రాశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందంపై సీఐ నాగరాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “సాయికృష్ణ కేసులో నేను పూర్తిగా నిర్దోషిని, నన్ను రాజకీయ లేదా వ్యక్తిగత కారణాలతో అన్యాయంగా ఇరికిస్తున్నారు” అని కోర్టుకు సమర్పించిన లిఖితపూర్వక లేఖలో స్పష్టం చేశారు. నాంపల్లి కోర్టులో సిట్ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ విచారణ సందర్భంగా సీఐ నాగరాజు తరఫు న్యాయవాది ఈ లేఖను న్యాయమూర్తికి సమర్పించారు. సిట్ అధికారులు తనను మానసికంగా, శారీరకంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని నాగరాజు ఆరోపించారు. “నన్ను బెదిరించి, భయభ్రాంతులకు గురిచేసి ఈ కేసులో బలవంతంగా ఇరికించే కుట్ర జరుగుతోంది” అని లేఖలో పేర్కొన్నారు. ఈ కేసులో సిట్ అధికారులకు తన కస్టడీతో ఎలాంటి అవసరం లేదని, కేవలం తనను మరింత వేధించడానికి మరియు థర్డ్ డిగ్రీ ఉపయోగించి తప్పుడు అంగీకార పత్రాలు తీసుకోవడానికే కస్టడీ కోరుతున్నారని ఆరోపించారు. “ఒకవేళ నన్ను విచారించాల్సి వస్తే, నా లాయర్ల సమక్షంలోనే విచారణ జరిపేలా ఆదేశాలివ్వండి. సిట్ అధికారులు నన్ను టార్చర్ చేయకుండా రక్షణ కల్పించండి” అని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
సాయికృష్ణ కేసు : నేను పూర్తిగా నిర్దోషిని, నన్ను రాజకీయ లేదా వ్యక్తిగత కారణాలతో ఇరికిస్తున్నారు : కోర్టుకు సీఐ నాగరాజు లేఖ
الجمعة، 3 يوليو 2026
Andhra Pradesh CI Nagaraju’s letter to the court I am being implicated for political or personal reasons Saikrishna Case: I am completely innocent
ليست هناك تعليقات:
إرسال تعليق