మహారాష్ట్రలోని అమరావతిలో ఉన్న ఓ ఆశ్రమంలో మహిళ అత్యాచారానికి గురైంది. ఆ ఆశ్రమ గురువు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిసింది. ఆనంద్ మఠానికి చెందిన దత్తగిరి గురు జైరాంజీ మహారాజ్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. భారతీయ న్యాయ సంహితలోని 64(2), 351(2) సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. పోక్సో చట్టం కింద కూడా కేసు రిజిస్టర్ చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు జరుగుతోందని చందూరు రైల్వే పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సురేశ్ మాస్కే తెలిపారు. 2014లో జరిగిన ఓ కార్యక్రమంలో తొలిసారి జైరాంజీ మహారాజ్‌ను కలిసినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నది. 2016 నుంచి మైనర్‌గా ఉన్నప్పటి నుంచి ఆ స్వామీజీతో ఉన్నట్లు ఆమె చెప్పింది. గురు జైరాంజీ తనను లైంగికంగా వేధించాని, ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని కోరుతూ ఆమె తన ఫిర్యాదులో తెలిపింది.
మహిళపై ఆధ్యాత్మిక గురువు అత్యాచారం : పోక్సో చట్టం కింద కేసు నమోదు
الثلاثاء، 21 يوليو 2026
Amravati Case Registered Under POCSO Act case was booked under Sections 64(2) and 351(2) of the Bharatiya Nyaya Sanhita maharashtra Spiritual Guru Rapes Woman
ليست هناك تعليقات:
إرسال تعليق