ప్రియురాల్ని చంపి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు

Monday, July 13, 2026

a native of Bhilai Gurugram haryana Ishara Ayubi Uttar Pradesh Man kills girlfriend Shreshth Malik (25) then commits suicide by jumping in front of a train

t f B! P L

హర్యానాలోని గురుగ్రామ్‌లో మూడు రోజుల నుంచి సహజీవనం చేస్తున్న ప్రియురాలిని ప్రియుడు కత్తితో పొడిచి చంపి అనంతరం అతడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఛత్తీస్‌గఢ్ లోని భిలాయ్‌కు చెందిన శ్రేష్ఠ్ మాలిక్(25) గురుగ్రామ్‌లో ఓ కంపెనీలో ఎఐ ఇంజినీర్‌గా వర్క్ చేస్తున్నాడు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఇషారా అయూబీ అనే యువతి గురుగ్రామ్‌లోని సెక్టార్ 55లో అద్దె ఇంట్లో నివసిస్తోంది. గత కొంత కాలంగా ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. గత మూడు రోజుల నుంచి ఇద్దరు కలిసి ఒకే ప్లాట్‌లో ఉంటున్నారు. రెండు రోజుల నుంచి కూతురు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌కు తల్లిదండ్రులు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ప్లాట్‌కు చేరుకొని బలవంతంగా డోర్లు ఓపెన్ చేశారు. ఇషారా రక్తపు మడుగులో కనిపించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ కాల్స్ ఆధారంగా శ్రేష్ట్ మాలిక్ చంపి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టగా గర్హీ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై రెండు ముక్కలైన మృతదేహం కనిపించింది. స్మార్ట్ ఫోన్ ఆధారంగా శ్రేష్ఠ్‌దిగా గుర్తించారు. ప్రియురాలిని చంపిన అనంతరం అతడు ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరు ఫోన్లనలో జరిగిన సంభాషణ, సందేశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. 

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    Featured Post

    QooQ