ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేని అంత్యక్రియలు ఈ నెల 4 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన తనయుడు, ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేని హాజరు గురించి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఈ కార్యక్రమానికి హాజరవుతారా లేదా అనే సందేహానికి ఇండియాలోని ఇరాన్ రాయబారి అయతొల్లా హకీం ఎలాహి ఖమేని అంత్యక్రియలకు ఆయన తనయుడు మొజ్తాబా హాజరుకావడం లేదని స్పష్టం చేశారు. ఖమేని అంత్యక్రియల కోసం ఇరాన్ వెళ్తూ ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరి 28న అమెరికా జరిపిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేని మరణించాడు. ఆయన తనయుడు మొజ్తాబా ఖమేని తప్పించుకున్నాడు. అమెరికా దాడిలో గాయపడ్డ మొజ్తాబా రహస్య ప్రదేశంలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అప్పటినుంచి ఆయన అజ్ఞాతంలోనే ఉన్నాడు. బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు తండ్రి, కుటుంబ సభ్యుల అంత్యక్రియలకైనా హాజరవుతారా అంటే లేదని ఇరాన్ చెబుతోంది. ఈ అంశంపై గురువారం అయతొల్లా హకీం ఎలాహి స్పందించారు. మొజ్తాబా భద్రత విషయంలో ఇరాన్ అధికారులు గ్యారెంటీ ఇవ్వలేకపోయారని, అందువల్ల ఖమేని హాజరు కావడం లేదన్నాడు. భద్రతా కారణాలరీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మొజ్తాబా బయటకు రావాలనుకుంటున్నారని, ప్రజలను కలవాలనుకుంటున్నారని.. అయితే, భద్రతా కారణాల వల్ల ప్రభుత్వం ఆయనను బయటకు వెళ్లనీయడం లేదన్నాడు. ఆయనకు భద్రత కల్పించలేమని అధికారులు చెప్పినట్లు, ఆయన బయటకు రావడం ప్రమాదకరమని అధికారులు భావిస్తున్నట్లు అయతొల్లా హకీం అన్నారు. ఖమేని అంత్యక్రియలకు ఇరాన్ అంతా సిద్ధం చేసిందన్నాడు. ఖమేని మరణం తమకు తీరని లోటని చెప్పాడు. ఖమేని అంత్యక్రియలు ఈ నెల 4 నుంచి 9వ తేదీ వరకు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి ఇండియా నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.
4 నుంచి ప్రారంభం కానున్న అయతొల్లా ఖమేని అంత్యక్రియలు : మొజ్తాబా హాజరుకావడం లేదు !
الخميس، 2 يوليو 2026
Ayatollah Khamenei's funeral to begin on the 4th funeral proceedings are scheduled to take place from the 4th to 9th international Iran's Ambassador to India reveals Mojtaba will not attend
ليست هناك تعليقات:
إرسال تعليق