బెంగళూరు లోని సరస్వతీపురం ఎస్‌బీఐ బ్యాంక్ శాఖ నుంచి మధు మోహన్ అనే వ్యక్తి కారు కోసం రూ. 25 లక్షల రుణం తీసుకున్నాడు. ఆ తర్వాత అతను ఆ రుణాన్ని తిరిగి చెల్లించలేదు. దీంతో, రుణాన్ని వసూలు చేయడానికి బ్యాంకు సిబ్బంది మధు మోహన్ ఇంటికి వెళ్లినప్పుడు, అతను అందుబాటులో లేడు. పైగా కారును బ్యాంకు నుంచి అనుమతి తీసుకోకుండా, రవాణా అధికారుల నకిలీ సంతకాలతో రికార్డులను తారుమారు చేసి, కారును షకీబ్ మన్సూర్ అనే వ్యక్తికి అమ్మినట్లు తేలింది. దోషులపై చర్యలు తీసుకోవాలని బ్యాంకు సిబ్బంది సరస్వతీపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
0 Comments