నాగాలాండ్ లో భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడి తొమ్మిది మంది మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటివరకూ నలుగురు మృతదేహాలను వెలికితీశామని మరో ఐదుగురు మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు మోన్ డిప్యూటీ కమిషనర్ వెన్నీ కోయక్ తెలిపారు. "మోన్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడ్డాయి. దాంతో జిల్లా వ్యాప్తంగా 9 మంది మృతి చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. భారీ వర్షాలకు మోన్ టౌన్, టిజిట్ నగరాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. అర్ధరాత్రి ఒంటిగంట నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయి. కొండ చరియలు కూలాయన్న విషయం మాకు ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య సమాచారం అందింది" అని కోన్ యాక్ తెలిపారు. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, పోలీసులు, అసోం రైఫిల్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు అలాగే స్థానిక ప్రజలు సహాయక చర్యలను వేగవంతం చేశారని పేర్కొన్నారు. ఇప్పటివరకూ నలుగురి మృతదేహాలను వెలికి తీశామని.. అందులో ముగ్గురు మహిళల మృతదేహాలు కాగా.. ఒకరిది మగ మృతదేహం అని డిప్యూటీ కమిషనర్ వెన్నీ కోయక్ తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇక కొండచరియలు విరిగిపడటంతో అనేక ప్రాంతాల్లో ప్రజల జీవన విధానం అస్తవ్యస్తం అయింది. ఇదే అంశంపై బీజేపీ రాజ్యసభ ఎంపీ ఎస్ ఫంగ్ నాన్ కోయక్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
నాగాలాండ్ లో భారీ వర్షాలు : కొండచరియలు విరిగిపడి తొమ్మిది మంది మృతి.. 12 మందికి తీవ్ర గాయాలు
الأحد، 19 يوليو 2026
four bodies have been recovered so far Heavy Rains in Nagaland Landslides Kill Nine Leave 12 Critically Injured national search operations are underway for the remaining five
ليست هناك تعليقات:
إرسال تعليق