కుక్క కరిస్తే యజమానికి రూ. 10 వేలు జరిమానా : కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన

الأربعاء، 22 يوليو 2026

000 Fine for Owners if Dog Bites dogs to roam freely keeping dogs without a license Kerala Government Announcement national or operating unauthorized dog breeding centers Rs. 10

t f B! P L

పెంపుడు కుక్కలను విచ్చలవిడిగా బయటకు వదిలి వేయడం, లైసెన్స్ లు లేకుండా కుక్కలను పెంచుకోవడం, లైసెన్స్ లు లేకుండా అనైతికంగా కుక్కల బ్రీడింగ్ సెంటర్లను నిర్వహించడం చేస్తే రూ. 10 వేలు జరిమానా విధిస్తామని కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వీధి కుక్కల విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలను నిర్మూలించాలని తెలిపింది. ఈ నేపథ్యంలో పెంపుడు కుక్కలపై కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 7 తేదీని డెడ్ లైన్ గా పెట్టుకుని వీధి కుక్కల నిర్వహణ, కార్యాచరణపై సమగ్రమైన ప్రణాళికను కేరళ హైకోర్టు ముందు సమర్పించనుంది రాష్ట్ర ప్రభుత్వం. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ డిపార్ట్ మెంట్(LSGD) అలాగే యానిమల్ హస్బెండరీ డిపార్ట్ మెంట్ అందించిన గణాంకాల ప్రకారం కేరళలో దాదాపు 8 లక్షల పెంపుడు కుక్కలు ఉన్నాయి. అలాగే దాదాపు 4 లక్షల వీధి కుక్కలు ఉన్నాయి. అయితే వీధి కుక్కలకు తోడు ఇటీవలి కాలంలో పెంపుడు కుక్కలను కూడా విచ్చలవిడిగా రోడ్డుపై వదిలేసి వెళ్తున్నారు. దీనిపై చట్టపరంగా కఠినమైన ఆంక్షలను విధించనుంది రాష్ట్ర ప్రభుత్వం. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ డిపార్ట్ మెంట్ ప్రిన్సిపల్ డైరెక్టర్ దివ్య ఎస్ అయ్యర్ మాట్లాడుతూ.. వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పంపించామని అన్నారు. సంబంధిత స్థానిక సంస్థలు, డిపార్ట్ మెంట్స్ కు ట్రాన్స్ ఫర్ చేశామని తెలిపారు. " నాలుగు ముఖ్యమైన పిల్లర్స్ ఆధారంగా మేము వీధి కుక్కల నిర్వహణ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నాం. తొలుత ఇతర మార్గాలను అన్వేషించి అవి పరిష్కారం కాని వేళ కుక్కలకు ఇంజెక్షన్ ఇచ్చి నిర్మూలిస్తున్నాం" అని తెలిపారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ