లండన్‌లో తెలుగు యువకుడి అనుమానాస్పద మృతి

الجمعة، 26 يونيو 2026

native of Kamareddy district Srinath Reddy successfully completed his first year of an MS program at a prominent university in Leicester Suspicious Death of Telugu Youth in London telangana

t f B! P L

తెలంగాణ లోని కామారెడ్డి జిల్లాకు చెందిన శ్రీనాథ్ రెడ్డి  ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తలమడ్ల గ్రామానికి చెందిన షాపుసాని మధుసూదన్ రెడ్డి, మంజుల దంపతుల కుమారుడు షాపుసాని శ్రీనాథ్ రెడ్డి (25) ఉన్నత విద్య కోసం లండన్ వెళ్లాడు. అక్కడ లీసెస్టర్ పట్టణంలోని ఓ ప్రముఖ యూనివర్సిటీలో ఎంఎస్ మొదటి సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసి ప్రస్తుతం రెండో సంవత్సరం చదువుతున్నాడు. అంతా సవ్యంగా సాగుతోందనుకున్న సమయంలో శ్రీనాథ్ రెడ్డి హఠాన్మరణం అతడి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. శ్రీనాథ్ రెడ్డి స్నేహితుడు అందించిన వివరాల ప్రకారం ఈనెల 22వ తేదీ రాత్రి శ్రీనాథ్ రెడ్డి తన స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యాడు. బర్త్‌డే పార్టీ ముగిసిన తర్వాత రాత్రి ఆలస్యంగా లండన్‌లోని తన గదికి చేరుకుని నిద్రపోయాడు. అయితే, మరుసటి రోజు ఎంతకీ శ్రీనాథ్ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన అతడి స్నేహితుడు గదిలోకి వెళ్లి చూశాడు. అప్పటికే శ్రీనాథ్ రెడ్డి స్పృహ లేకుండా పడి ఉండటం, మరణించి ఉండటాన్ని గమనించిన స్నేహితుడు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాడు. వెంటనే ఈ సమాచారాన్ని లండన్‌లో ఉన్న ఇతర మిత్రులకు చేరవేశాడు. లండన్‌లో ఉన్న శ్రీనాథ్ రెడ్డి స్నేహితులు ఈ విషాద వార్తను స్వగ్రామమైన తలమడ్లలోని అతడి తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. చేతికి అందిన కొడుకు లండన్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించాడనే వార్త వినగానే తల్లిదండ్రులు మధుసూదన్ రెడ్డి, మంజుల గుండెలవిసేలా రోదించారు. ప్రస్తుతం తలమడ్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు, అలాగే లండన్ వెళ్లి అక్కడి పరిస్థితులను తెలుసుకునేందుకు తల్లిదండ్రులు, బంధువులు పాస్‌పోర్ట్, వీసా తదితర ఏర్పాట్లలో నిమగ్నమైనట్లు సమాచారం. ఈ ఘటనపై లండన్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ