ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ఆర్ కడప జిల్లా ఖాజీపేట మండలం దుంపలగట్టు గ్రామంలో ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి వనం సంజన (18), వనం అర్చన (14) అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కుమార్తెలు దుర్మరణం చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన వనం శివవాణి కుటుంబానికి పందుల పెంపకమే జీవనాధారం. ప్రతిరోజులాగే శుక్రవారం కూడా ఆమె తన కుమార్తెలు సంజన, అర్చన, మరియు కుమారులు గౌతమ్, కార్తీక్‌లతో కలిసి పందులను మేపేందుకు గ్రామ శివారుకు వెళ్లారు. అక్కడ ఉన్న ఒక నీటి గుంత సమీపంలో పందులను మేపుతుండగా, అక్కాచెల్లెళ్లిద్దరూ ప్రమాదవశాత్తు ఆ నీటి గుంతలో పడిపోయారు. లోతు ఎక్కువగా ఉండటంతో వారు నీట మునిగిపోయారు. ప్రమాదాన్ని గమనించి కుటుంబ సభ్యులు కేకలు వేయడంతో, సమాచారం అందుకున్న గ్రామస్థులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే, అప్పటికే ఇద్దరు బాలికలు నీట మునిగి ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు.
నీటి గుంతలో పడి అక్కాచెల్లెళ్లు దుర్మరణం
الجمعة، 5 يونيو 2026
Andhra Pradesh crime Dumpalagattu village Khazipet Mandal Sisters Die After Falling into Water Pit YSR Kadapa district
ليست هناك تعليقات:
إرسال تعليق