బెంగళూరు విమానాశ్రయంలో ఓలా క్యాబ్‌లు సిద్ధంగా ఉన్నా - ఉబర్‌ కోసం ప్రయాణికులు క్యూలో నిలబడిన దృశ్యం !

الجمعة، 19 يونيو 2026

despite Ola cabs being readily available national Passengers queue for Uber at Bengaluru airport Traveler shares an interesting experience in a LinkedIn post

t f B! P L

బెంగళూరు విమానాశ్రయంలో జరిగిన ఓ సంఘటన మాత్రం అందుకు భిన్నమైన చిత్రాన్ని చూపించింది. ఓలా క్యాబ్‌లు సిద్ధంగా ఉన్నా, ప్రయాణికులు మాత్రం అరగంటపాటు ఉబర్‌ కోసం వేచి ఉండడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. బెంగళూరుకు చెందిన ఆకాశ్‌ కొటాల్వార్‌ అనే వ్యక్తి తన లింక్డ్‌ఇన్‌ పోస్టులో ఆసక్తికర అనుభవాన్ని పంచుకున్నాడు. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్‌-2లో దిగిన తర్వాత ఉబర్‌ గో సేవ కోసం దాదాపు 30 నుంచి 40 మంది ప్రయాణికులు క్యూలో నిలబడి ఉన్నారని తెలిపాడు. అదే సమయంలో ఓలా కౌంటర్‌ వద్ద క్యాబ్‌లు సిద్ధంగా ఉన్నాయని, వెంటనే ప్రయాణం ప్రారంభించవచ్చని సిబ్బంది చెబుతున్నప్పటికీ ఎవరూ అక్కడికి వెళ్లలేదని పేర్కొన్నాడు. అయితే ఆకాశ్‌ కూడా ఉబర్‌ కోసం సుమారు 30 నిమిషాల నిరీక్షణ సమయం కనిపించిందని, అయినప్పటికీ ఓలాకు మారకుండా ఉబర్‌లోనే ఖరీదైన 'ఉబర్‌ కంఫర్ట్‌' సేవను ఎంచుకున్నానని ఆకాష్‌ తెలిపాడు. తనలాగే క్యూలో ఉన్నవారిలో కూడా ఎవరూ ఓలాకు మారలేదని చెప్పాడు. ఇది బ్రాండ్‌ లాయల్టీ కంటే "స్విచింగ్‌ కాస్ట్‌" అనే మానసిక భావనకు ఉదాహరణ అని ఆకాష్‌ అభిప్రాయపడ్డాడు. కొత్త సేవకు మారితే ఏమవుతుందో తెలియని అనిశ్చితి, ఇప్పటికే అలవాటైన సేవను వదలాలనే ఇబ్బంది. దీనినే 'స్విచింగ్‌ కాస్ట్‌'గా పిలుస్తారు. ఈ కేసులో జర్నీ కోసం మరో యాప్‌ డౌన్‌లోడ్‌ చేయడం, కొత్త సేవను ప్రయత్నించడం, అనిశ్చితిని ఎదుర్కోవడం కంటే ఇప్పటికే తెలిసిన సేవనే వినియోగదారులు ఎంచుకుంటారని వివరించాడు. ఈ పోస్టుపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు ఉబర్‌ సేవలు గతంలో మరింత స్థిరంగా, వినియోగదారులకు అనుకూలంగా ఉండటంతో ప్రజలు దానిని ఎక్కువగా నమ్ముతున్నారని వ్యాఖ్యానించారు. మరికొందరు మాత్రం వినియోగదారుల నిర్ణయం పరిస్థితిని బట్టి మారుతుందని, ధరలు, సౌలభ్యం, ప్రయాణ సమయం వంటి అంశాలు కూడా ప్రభావం చూపుతాయని అభిప్రాయపడ్డారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ