వాట్సాప్ తన యూజర్ల కోసం మరో కొత్త ఫీచర్ యూజర్ నేమ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ తాజాగా యూజర్ నేమ్ ఫీచర్ కోసం యూజర్ పేరును ముందుగా రిజర్వ్ చేసుకోవాలి మరియు ఈ ప్రక్రియ ను ఇప్పుడు ప్రారంభించింది. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వినియోగదారులు తమ మొబైల్ నంబర్ కు బదులుగా ప్రత్యేకమైన యూజర్ నేమ్ ను ఉపయోగించి ఇతరులతో కనెక్ట్ కావచ్చు. ఈ ఫీచర్ తో ప్రతి ఒక్కరికి ఫోన్ నంబర్ ను షేర్ చేయాల్సిన అవసరం తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం, ఈ ఫీచర్ కోసం నేమ్ రిజర్వేషన్ ను వాట్సాప్ అందించింది. ఇప్పటికే ఈ కొత్త ఫీచర్ కోసం నోటిఫికేషన్ లను కూడా అందించింది. మీరు కూడా ఈ కొత్త ఫీచర్ తో మీ వాట్సాప్ నెంబర్ స్థానంలో మీరు రిజర్వ్ చేసుకునే పేరును అందుకోవచ్చు. వాట్సాప్ లో యూజర్ నేమ్ అందుకున్న తర్వాత మీ ఫోన్ నెంబర్ కాకుండా ఈ కొత్త యూజర్ నేమ్ ను షేర్ చేస్తే సరిపోతుంది. ఇలా గుర్తు తెలియని వారికి నెంబర్ ఇవ్వకుండా మొబైల్ నెంబర్ ను దాచుకునే అవకాశం వాట్సాప్ అందించింది. వాట్సాప్ లో ఇప్పటికే మీకు నోటిఫికేషన్ రూపంలో ఈ కొత్త ఫీచర్ మీరు అందుకుని ఉంటారు. ఈ ఫీచర్ కోసం నోటిఫికేషన్ ను ఓపెన్ చేసి "Create username" పైన క్లిక్ చేయండి. యూజర్ నేమ్ రిజర్వ్ చేయడానికి @ తో ఒక బాక్స్ వస్తుంది. ఇందులో మీరు కోరుకునే యూజర్ నేమ్ ను మీరు ఇక్కడ అందించి సేవ్ బటన్ పై క్లిక్ చేసి సేవ్ చేసుకోండి. ఒకవేళ నోటిఫికేషన్ రాకుంటే, మీరు మీ అకౌంట్ సెట్టింగ్స్ లోకి వెళ్లి అక్కడ అకౌంట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ "Your Account" లో యూజర్ నేమ్ ఫీచర్ ఉంటుంది. ఈ కొత్త ఫీచర్ పై క్లిక్ చేసి మీరు మీ యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి పేరును రిజర్వ్ చేసుకుంటే, ఆ పేరులో మార్పు ఉండదని గుర్తుంచుకోండి. అలాగే, పేరును ఎవరైతే ముందుగా రిజర్వ్ చేసుకుంటారో, వారికే పేరు లభిస్తుంది కాబట్టి ముందుగా మీ పేరు రిజర్వ్ చేసుకోవడం మంచిది. ఈ కొత్త ఫీచర్ లో ప్రతి యూజర్‌కు ప్రత్యేకమైన యూజర్ నేమ్ ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఒకసారి రిజిస్టర్ చేసిన ఆ పేరు మరొకరు ఉపయోగించలేరు. ఈ ఫీచర్ ప్రధానంగా గోప్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా తీసుకొచ్చినట్లు వాట్సాప్ తెలిపింది. ముఖ్యంగా, వ్యాపార అవసరాలు, ఆన్‌లైన్ కమ్యూనిటీలు, కొత్త కాంటాక్ట్స్ మరియు గ్రూప్ కమ్యూనికేషన్ లో ఫోన్ నంబర్ ను వెల్లడించకుండా చాట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది.
వాట్సాప్ లో అందుబాటులోకి తీసుకొచ్చిన కొత్త ఫీచర్ యూజర్ నేమ్
الثلاثاء، 30 يونيو 2026
potentially reducing the need to share phone numbers with everyone process of reserving a username has already begun technology WhatsApp Introduces New Username Feature
ليست هناك تعليقات:
إرسال تعليق