ఏపీ సక్సెస్ ఫార్ములా స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ : రిపబ్లిక్ టీవీ నిర్వహించిన సమ్మిట్ లో మంత్రి నారా లోకేష్

الاثنين، 22 يونيو 2026

'3S' formula and Service Andhra Pradesh AP's Success Formula: Speed Minister Nara Lokesh at the Republic TV Summit stability

t f B! P L

రిపబ్లిక్ టీవీ నిర్వహించిన సమ్మిట్ లో ఆయన భారత్ గ్లోబల్ స్టేజ్‌పై ఒక 'షేపింగ్ పవర్'గా ఎలా ఎదుగుతోందనే ప్యానెల్ చర్చలో మంత్రి నారా లోకేష్ పాల్గొని మాట్లాడుతూ పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ అందిస్తున్న స్పీడ్, స్టెబిలిటీ, సర్వీస్ ..త్రీ ఎస్ ఫార్ములా కేవలం ఏపీ వృద్ధికే కాకుండా, మొత్తంగా భారతదేశం గ్లోబల్ సప్లై చైన్‌లో చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు దోహదపడుతుందని ప్రకటించారు. గ్లోబల్ నరేటివ్‌ను ప్రభావితం చేయగల దార్శనికత కలిగిన యువ నాయకుడిగా లోకేష్ ఈ సమిట్ ద్వారా జాతీయ స్థాయిలో తన ముద్రను గట్టిగా వేయగలిగారు. నేషన్ ఫస్ట్ అనే పవర్‌ఫుల్ థీమ్‌తో రిపబ్లిక్ మీడియా నెట్‌వర్క్ నిర్వహించిన ఈ సదస్సులో భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపాలనే ప్రధాని నరేంద్ర మోదీ విశ్వగురు విజన్‌కు అనుగుణంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన స్పీడ్ గవర్నెన్స్ ద్వారా దేశ ఆర్థిక ఎదుగుదలకు ఏ విధంగా ఊతమిస్తోందో జాతీయ వేదికపై స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించారు. కూటమికి ఎక్కువ మంది ఎంపీలున్నారనే అడ్వాంటేజ్ తోనే కేంద్రం నుండి నిధులు, ప్రాజెక్టులు పొందుతున్నారా? అని ఎదురైన ఒక కీలక ప్రశ్నకు లోకేష్ తనదైన శైలిలో సమాధానాలిస్తూ జాతీయ మీడియాను ఆకట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వం పాలసీలు, ప్రాజెక్టులను అందరి కోసమే చేపడుతుంది. కానీ, ఏ రాష్ట్రం ఎంత త్వరగా స్పందిస్తుందనే దానిపైనే ప్రాజెక్టుల రాక ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు.. కేంద్ర రక్షణ శాఖ ప్రాజెక్టు ఒకటి వస్తోందని తెలియగానే, మిగతా రాష్ట్రాలు ఇంకా నిద్రలేవక ముందే, మేము కేవలం 37 రోజుల్లోనే ఎక్కడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా 600 ఎకరాల భూమిని కేటాయించాం. ఆ వేగం వల్లే ఏపీకి ఆ ప్రాజెక్టు దక్కింది అని లోకేష్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో తీసుకొస్తున్న విద్యా సంస్కరణలు, డిజిటల్ గవర్నెన్స్ గురించి వివరించారు. రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని లోకేష్ వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఏకంగా 85 వేల మంది విద్యార్థులు ప్రైవేటు స్కూల్స్ నుండి ప్రభుత్వ స్కూల్స్‌కు షిఫ్ట్ అయ్యారు. ఒక కార్పొరేట్ సంస్థ తరహాలో టెక్నాలజీని వాడుతూ.. నేను అమరావతిలో నా ఛాంబర్‌లో కూర్చొని రాష్ట్రంలోని ఏ స్కూల్‌లో ఏ టీచర్‌కు, ఏ విద్యార్థికి ఏం అవసరం ఉందో డిజిటల్‌గా పర్యవేక్షించగలను. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఎలాంటి ప్రమాణాలు ఉంటాయో.. ఇప్పుడు మేము ప్రభుత్వపరంగా అలాంటి నాణ్యతను అందించగలుగుతున్నాం అని గర్వంగా ప్రకటించారు. 2028 వకల్లా అమరావతిలోని ప్రధాన ప్రభుత్వ భవనాలను ఓపెన్ చేస్తాం. సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు భవనాలను చెప్పిన సమయానికి పూర్తి చేసి తీరుతాం. అమరావతిని ఆంధ్రప్రదేశ్‌కు ఒక తిరుగులేని ఎకనామిక్ పవర్‌హౌస్‌గా మార్చాలన్నదే మా ప్రభుత్వ తాపత్రయం అని లోకేష్ ఉద్ఘాటించారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ