దేశీయ ప్రాథమిక మార్కెట్ రానున్న రోజుల్లో ఐపీఓలతో మరింత సందడి చేయనుంది. గ్లోబల్ ట్రావెల్-టెక్ యూనికార్న్ ఓయో మాతృసంస్థ 'ప్రిజమ్', వార్‌బర్గ్ పింకస్ పెట్టుబడులున్న 'ట్రూహోమ్ ఫైనాన్స్', 'వీగాలాండ్ డెవలపర్స్', 'అద్వాంతా ఎంటర్‌ప్రైజెస్', 'మెహతా హైటెక్ ఇండస్ట్రీస్'ల పబ్లిక్ ఇష్యూలకు సెబీ అనుమతి ఇచ్చింది. ఈ ఐదు కంపెనీలు కలిపి సుమారు రూ.10,000 కోట్లు సమీకరించే అవకాశం ఉందని మర్చంట్ బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. కంపెనీలు దాఖలు చేసిన ముసాయిదా పత్రాలపై సెబీ జూన్ 1-5 మధ్య తన పరిశీలన పూర్తిచేసి అనుమతులు జారీ చేసింది. గ్లోబల్ ట్రావెల్-టెక్ దిగ్గజం ఓయోను నిర్వహిస్తున్న 'ప్రిజమ్' సంస్థ ఐపీఓ ద్వారా రూ.6,650 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. ఈ ఇష్యూతో సంస్థ విలువ 7-8 బిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సంస్థ 2025 డిసెంబరులో కాని్ఫడెన్షియల్ ప్రి-ఫైలింగ్ మార్గం ద్వారా సెబీకి ముసాయిదా పత్రాలను సమరి్పంచింది. ఓయో ఆపరేటర్ 'ఒరవెల్ స్టేస్' 2025 సెప్టెంబరులో 'ప్రిజమ్'గా పేరు మార్చుకుంది.
ホーム
/
stock market
/
ఐపీఓకు సిద్ధమవుతున్న ఐదు కంపెనీలు
الأربعاء، 10 يونيو 2026
business EBI has granted approval for the public issues of five companies Five Companies Gear Up for IPOs national stock market
ليست هناك تعليقات:
إرسال تعليق