బీహార్ లోని పాటలీపుత్ర రైల్వే స్టేషన్ వద్ద పోలీస్ ప్రొహిబిషన్ డిపార్ట్‌మెంట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల నిరసన హింసాత్మకంగా మారింది. రైళ్లు సకాలంలో అందుబాటులో లేకపోవడంతో వేలాది మంది విద్యార్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. రైల్వే స్టేషన్‌లో గంటల తరబడి ఎదురు చూడాల్సి రావడం, కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఆందోళనకు దిగారు. దీంతో రాత్రంతా తీవ్ర ఉద్రిక్తతత కొనసాగింది. నిరసనకారులు రైళ్ల రాకపోకలను సైతం అడ్డుకున్నారు. పట్టాలపై బైఠాయించారు. బీహార్ పోలీస్ ప్రొహిబిషన్ డిపార్ట్‌మెంట్ పరీక్షలు నేడు జరగాల్సి ఉంది. దీనికోసం విద్యార్థులు తమకు కేటాయించిన ఎగ్జామ్ సెంటర్లకు వెళ్లడానికి రైళ్ల మీద ఆధారపడ్డారు. వందలాది మంది అభ్యర్థులు స్టేషన్ ప్రాంగణంలో గుమిగూడారు. సకాలంలో రైళ్లు రాకపోవడంతో తీవ్ర అసహనానికి గురయ్యారు. రైల్వే ట్రాక్‌లపైకి వెళ్లారు. రైళ్లను నిలిపివేశారు. ట్రాక్‌లను బ్లాక్ చేశారు. రాళ్ల దాడికి పాల్పడ్డారు. వారిని అడ్డుకోవడానికి ఆర్పీఎఫ్, జీపీఎఫ్, పోలీసులు ప్రయత్నిచడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. వారి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. భద్రతా సిబ్బంది ముందుగా నిరసనకారులను సముదాయించే ప్రయత్నం చేసినట్లు అధికారులు తెలిపారు. ట్రాక్ లపై కూర్చున్న విద్యార్థులు అక్కడి నుంచి కదల్లేదు. రైళ్లను వెళ్లనివ్వలేదు. దీంతో ఆర్పీఎఫ్, జీపీఎఫ్ సిబ్బంది వారిని బలవంతంగా పక్కకు తీసుకెళ్లడానికి ప్రయత్నించడంతో పరిస్థితి మరింత తీవ్రతరమైంది. ఆగ్రహించిన విద్యార్థులు రాళ్ల దాడికి దిగారు. ఉద్రిక్తత పెరగడంతో నిరసనకారులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జ్ చేసి, టియర్ గ్యాస్ ప్రయోగించారు.
బీహార్ లో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల నిరసన : లాఠీచార్జ్ చేసి, టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
الأحد، 14 يونيو 2026
Bihar Police Prohibition Department exam turned violent Police Resort to Lathi-charge and Tear Gas Protest by Exam Candidates in Bihar
ليست هناك تعليقات:
إرسال تعليق