హైదరాబాద్ లోని పటాన్‌చెరు శ్రీనగర్ కాలనీకి చెందిన విశ్రాంత ప్రైవేటు ఉద్యోగి మోహన్ రెడ్డిని సైబర్ నేరగాళ్లు మనీలాండరింగ్ కేసు పేరుతో భయపెట్టి ఆయన నుంచి రూ.58.94 లక్షలను దశలవారీగా వసూలు చేశారు. బాధితుడికి ప్రవీణ్ కుమార్, రాజేష్ మిశ్రా అనే ఇద్దరు ఫోన్ చేశారు. జెట్ ఎయిర్‌వేస్ మాజీ చైర్మన్ నరేశ్ గోయల్‌కు సంబంధించిన రూ.538 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఆధార్ వివరాలు దుర్వినియోగమయ్యాయని ఆరోపిస్తూ మోహన్ రెడ్డిని బెదిరించారు. ఈ కేసులో విÖ పేరుతో కూడా లావాదేవీలు జరిగాయని, దాదాపు రూ.2 కోట్ల లావాదేవీలు జరగగా వాటిపై కమీషన్ తీసుకున్నారంటూ ఆయనను భయభ్రాంతులకు గురిచేశారు. విÖపై కేసు నమోదైంది, అరెస్టు చేయాల్సి ఉంటుంది అంటూ ఒత్తిడి చేశారు. దీంతో భయపడిన మోహన్ రెడ్డి దశలవారీగా పలు బ్యాంకు ఖాతాలకు మొత్తం రూ.58.94 లక్షలు బదిలీ చేశారు. అనంతరం ఇది మోసమని గుర్తించిన బాధితుడు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల బ్యాంకు ఖాతాలు, ఫోన్ నంబర్లు, లావాదేవీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. సైబర్ నేరగాళ్లు తరచూ అధికారులుగా నటిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని, ప్రజలు ఇలాంటి కాల్స్‌కు స్పందించవద్దని పోలీసులు సూచించారు.
మనీలాండరింగ్ కేసు పేరుతో విశ్రాంత ప్రైవేటు ఉద్యోగిని భయపెట్టి రూ.58.94 లక్షలను దోచుకున్నసైబర్ నేరగాళ్లు
السبت، 13 يونيو 2026
Cyber criminals swindle ₹58.94 lakh from retired private employee hyderabad Patancheru Srinagar Colony threatening him with a money laundering case
ليست هناك تعليقات:
إرسال تعليق